మన గడప తొక్కి సాయం అడిగిన ఆడ బిడ్డతో రాజకీయం ఏంట్రా? యాత్ర ప్రీమియర్స్ షో టాక్?

yatra primiyars show tak..jagan ending touch super. mammutti yatra action will be superd and her perfomance is peak and jagan

yatra twitter review

తెలుగు సినీ చరిత్ర లో ఇప్పటివరకు చాలా బియోపిక్స్ వచ్చాయి. ఇప్పటివరకు టాలీవుడ్ లో వచ్చిన బయోపిక్ లకు ఈ రాజశేఖర్ రెడ్డి యాత్ర కాస్త డిఫరెంట్ బయోపిక్ అని చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలకమైన యాత్ర ను బేస్ చేసుకొని దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించిన యాత్ర నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.

జగన్ తో ఎండింగ్ టచ్ అద్భుతం…

ఇక యుఎస్ లో సినిమా ప్రీమియర్ షోలను ఇక్కడికంటే ముందే ప్రదర్శించారు. ఇక సినిమా విషయానికి వస్తే, మెయిన్ గా వైఎస్ అభిమానులకు కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు వైఎస్ సన్నివేశాలను చాలా ఎమోషనల్ గా ప్రజెంట్ చేశాడు. సినిమాలో మెయిన్ గా కథ కంటే వైఎస్ కి సంబంధించిన పొలిటికల్ సిచువేషన్స్ ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు.

అలాగే కాంట్రవర్సీ సీన్స్ ను కూడా దర్శకుడు ఇరికించే ప్రయత్నం చేశాడు. మరోవైపు కాంగ్రెస్ పాలన లోపాలను, వైఎస్ పార్టీలో ఎలా గుర్తింపు తెచ్చుకొని జనాల్లో హీరో అయ్యారు అనే సీన్స్ బాగానే ప్రజెంట్ చేశాడు. రైతులకు ఫ్రీ పవర్ ఇచ్చే సీన్స్ అలాగే సాధారణ జనాలతో ఎమోషనల్ మూమెంట్స్ స్క్రీన్ పై వైఎస్ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తాయి.

అయితే అక్కడక్కడా స్లో గా సాగే సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో వైఎస్ ని ఎలివేట్ చేసే సీన్స్ మెయిన్ ప్లస్ పాయింట్స్ అలాగే కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. “మన గడప తొక్కి సాయం అడిగిన ఆడ బిడ్డతో రాజకీయం ఏందిరా?” అనే డైలాగ్ తోనే వైఎస్ పాత్రను స్ట్రాంగ్ గా ఎలివేట్ చేశారు. లాస్ట్ లో జగన్ స్పీచ్ తో సినిమాకు ఎండింగ్ టచ్ ఇచ్చారు. జగన్ తండ్రి గురించి మాట్లాడే ఒరిజినల్ సీన్ తో సినిమా ఎండ్ అవుతుంది. అయితే మొత్తంగా సినిమా వైఎస్ అభిమానులకు బాగానే నచ్చుతుందని చెప్పవచ్చు గాని మిగతా ఫ్యాన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.