భీమిలి లో పైచేయి ఎవరిదీ.! టీడిపి నా? లేదా వైసిపీ నా?

- Advertisement -

ఏపీలో ఎన్నికల హడావిడితో కీలకనేతలందరు అధికారం కోసం తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పార్టీ అధినేతల దగ్గర నుండి , అభ్యర్థుల వరకు అందరూ కూడా తీరిక లేకుండా ప్రచారం నిర్వహిస్తూ అధికారమే లక్ష్యం గ పనిచేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు మనం విశాఖ భీమిలి నియోజకవర్గం గురించి ఒకసారి చూస్తే ….

భీమిలి టీడీపీ ఆవిర్భావం నుండి టీడీపీకి ఆపార్టీకి కంచుకోట. వై ఎస్ ప్రభంజనం వీచిన 2004, 09 ఎన్నికల్లో తప్ప, మిగతా అన్నీ ఎన్నికల్లో పసుపు జెండానే ఎగిరింది. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ నుండి మంత్రి గంటా శ్రీనివాసరావు, 37వేల భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు.

అయితే వచ్చే ఈ ఎన్నికల్లో భీమిలిలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. పోయిన ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా టీడీపీ తరుపున గెలిచిన అవంతి శ్రీనివాస్, ఈ సారి భీమిలి వైసీపీ అభ్యర్ధిగా నిలబడ్డారు. ఇక్కడ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న అక్రమాని విజయ నిర్మలని విశాఖ తూర్పులో తెదేపా నేత వెలగపూడి రామకృష్ణపై పోటీకి దింపారు.

అటు గంటా కూడా రాజకీయ కారణాల వలన భీమిలి నుండి కాకుండా విశాఖ ఉత్తరంలో టీడీపీ తరుపున నిలిచారు. దీంతో టీడీపీ చాలరోజులుగా గట్టి అభ్యర్ధి కోసం వెతికి , చివరకి విశాఖలో సీనియర్ నేతగా ఉన్న సబ్బం హరిని పార్టీలోకి తీసుకుని భీమిలి పోరులో దింపింది. అటు అవంతి ఇటు సబ్బం పోటీకి దిగడంతో భీమిలి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

సబ్బంకి గతంలో అనకాపల్లి ఎంపీగా, విశాఖ మేయర్‌గా చేసిన అనుభవం ఉంది. విశాఖ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది. అలాగే గవర సామాజికవర్గంలో ఆయనకి మంచి పట్టు ఉంది. సౌమ్యుడుగా ఉన్న సబ్బంకి భీమిలిలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక వీరిద్ద‌రు అన‌కాప‌ల్లి ఎంపీలుగా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న‌వారే.

ఇక అటు అవంతికి ఆర్ధికంగా సబ్బం కంటే బలవంతుడు, 2009లో ప్రజారాజ్యం తరుపున భీమిలి నుండి గెలుపొందిన అనుభవం కూడా ఉంది. దీంతో నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించుకున్నాడు. అలాగే సబ్బంలాగే అవంతి కూడా అనకాపల్లి ఎంపీగా చేశారు. పైగా అవంతి ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు నుండే భీమిలిలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఆయనకి జగన్ , వైసీపీ మైలేజ్ కూడా కలిసిరానుంది.

జగన్ పాదయాత్ర సందర్భం లో ఇక్కడ ఆయనకి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. అలాగే టీడీపీ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అవంతికి బాగా కలిసొచ్చే అంశం అలాగే సబ్బం హరి టీడీపీలో చివరిన టికెట్ పొందాడు. ఇప్పుడు బరిలో దిగిన సబ్బం హరికి ఎక్కువ టైమ్ కూడా లేదు. మరి ఈ తక్కువ టైమ్‌లో సబ్బం ప్రజలని ఏ మేర తనవైపు తిప్పుకుంటారో చూడాలి. అలాగే ఆర్ధికంగా బలంగా ఉన్న అవంతిని ఢీకొట్టేందుకు సబ్బంకి గంటా సాయం చేస్తారని తెలుస్తోంది. భీమిలిలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే..

- Advertisement -

1 COMMENT