27.8 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి…

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి…

YSRCP News, AP Parliamentary News, Vijay Sai Reddy News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి..మరో కీలక పదవి దక్కింది. పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.

అటు లోక్‌సభలో వైసీపీ పక్ష నేతగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఇక పార్టీ చీఫ్ విప్‌గా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఇదిలా ఉంటే ఈ నెల 12న ఏపీ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే  ప్రొటెం స్పీకర్‌గా చిన్న అప్పలనాయుడును నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ నెల 8న కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. అనంతరం పదో తేదీన రాష్ట్ర కేబినెట్‌ తొలి సమావేశం జరుగుతుంది. ఆ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారుచేస్తారు. ఈ నెల 12 నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని జగన్‌ ప్రాథమికంగా నిర్ణయించారు.

చదవండి: కేశినేని, సీఎం రమేశ్‌లకు కీలక బాధ్యతలు అప్పజెప్పిన చంద్రబాబు..
- Advertisement -