26.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చేనేతకు పుట్టిల్లు.. తెలుగుదేశం పార్టీ: వావిలాల సరళాదేవి అలుపెరగని ప్రచారం…

చేనేతకు పుట్టిల్లు.. తెలుగుదేశం పార్టీ: వావిలాల సరళాదేవి అలుపెరగని ప్రచారం…

- Advertisement -
# ఇటు రాష్ట్రంలోని జిల్లాల్లో, అలాగే సొంత నియోజకవర్గం తణుకులో…
# ఉదయం నుంచి ప్రచార సమయం ముగిసే వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థన…
# సినీనటి దివ్యవాణితో కలిసి రోడ్ షో, వంగవీటి రాధాతో కలిసి ప్రచార సభలు, అలుపెరగని ప్రచారం…

తణుకు: చేనేతకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ.. ఇది అందరికీ తెలిసిన నిజం. మన కోసం ఆలోచించే నాయకుడు అక్కడ  చంద్రన్న ఉన్నాడు.. మనల్ని అక్కున చేర్చుకునే పార్టీ తెలుగుదేశం అక్కడ ఉంది. మనం వెళితే సమస్యలను వినే వ్యవస్థ అక్కడే ఉందని చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి పేర్కొన్నారు.

ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, ఇటు తూర్పుగోదావరి, ఉత్తరాంధ్రలో ఇలా ఎన్నో జిల్లాలు తిరిగి.. పశ్చిమగోదావరి జిల్లాలో.. ఇంకా తణుకు నియోజకవర్గం, పట్టణంలో వార్డు వార్డులో ఇంటింటికి వెళ్లి ఉదయం నుంచి రాత్రి ప్రచారం సమయం ముగిసేవరకు అలుపెరగని ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో సినీనటి దివ్యవాణి తణుకు పట్టణానికి రావడంతో.. ఆమెతో కలిసి రోడ్ షో లో సరళాదేవి పాల్గొన్నారు.

vavilala-sarala-campaign-in-tanuku-townఈ సందర్భంగా వావిలాల సరళాదేవి ప్రజలతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ  చేనేతలకు ఇచ్చే ప్రత్యేక పథకాలను వివరించారు. వాటిలో ముఖ్యంగా వర్షాకాల సమయంలో రెండు నెలలకు 4వేల రూపాయల జీవన భృతి, ఇంకా 50 ఏళ్లకే పెన్షను సౌకర్యం, ఇవేకాకుండా ప్రభుత్వం తరఫున పేద ప్రజలకిచ్చే ఆదరణ పథకంలాంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని ఆమె ఇంటింటికి వెళ్లి అన్నీ వివరంగా చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీకే ఓటేయ్యండి..అని కాకుండా..అసలెందుకు ఆ పార్టీకి ఓటేయ్యాలి..అని చక్కగా అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారు.  అలాగే చేనేత కార్పొరేషన్ ఏర్పాటయ్యింది.. ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న ఎన్నో చేనేతల సమస్యలకు పరిష్కారం దొరికినట్లయ్యింది. మన సమస్యలు చెప్పుకునేందుకు ఒక వేదిక దొరికింది.. అని చెబుతున్నారు.

మనకి ఒక కార్యాలయం ఉంది. అక్కడకి మీరు నిరభ్యంతరంగా రావచ్చు.. ప్రభుత్వం ద్వారా పరిష్కరామయ్యే సమస్యలు, ప్రభుత్వం తరఫున చేనేతలకు చేయాల్సిన సమస్యలపై నిరంతరం అక్కడ చర్చ జరుగుతుంది. అందువల్ల మన  ముఖ్యమంత్రి చంద్రబాబానాయుడు నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు.. మన నాయకుడు ఎంపిక చేసిన అభ్యర్థులకు ఓటేసేందుకు ముందుకు రండి. అని ప్రచారంలో ముందుకు వెళుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, ప్రత్తిపాడు, పిఠాపురం, ధర్మవరం మండలాల్లో, ఇంకా చేనేత గ్రామాల్లో, అలాగే మండపేట నియోజకవర్గం ఏడిద గ్రామంలో ప్రజలు, నేతన్నలు, సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. సభల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో ర్యాలీగా పర్యటించి.. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని అభ్యర్థించారు. తణుకు పట్టణంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

అలాగే వంగవీటి రాధా రావడంతో అటు ప్రచారానికి వెళ్లారు. అలాగే సినీనటి దివ్యవాణి రావడంతో ఆమెతో కలిసి రోడ్ షోల్లో పాల్గొన్నారు. అలాగే  తణుకు అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ  వెంట కూడా పలు వార్డుల్లో ప్రచారంలో పాల్గొని..తెలుగుదేశం పార్టీకి అంకితభావం గల కార్యకర్తగా పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తున్నారు.

vavilala-sarala-campaign-in-east-godavari– శ్రీనివాస్ మిర్తిపాటి

- Advertisement -