
పాణ్యం: అలవాట్లో పొరపాటు, జరిగినట్టుగా ఉంది. ఇన్నాళ్లూ జగన్, జగన్ అంటూ తిరిగారు పాపం! ఇప్పుడేమో కండువాలు మార్చేశారు. అయితే వ్యవహారం ఇంకా అలవాటు అయినట్టుగా లేదు. అందుకే నోరు తడబడింది. సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పడం వరకూ బాగానే చెప్పారు కానీ, తీరా ప్రసంగాన్ని ముగిస్తూ ‘జై జగన్..’ అన్నారు.
ఇదీ పరిస్థితి. ఇటీవలే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న కర్నూలు జిల్లా నేత గౌరు చరితారెడ్డి తన ఎన్నికల ప్రసంగంలో ‘జై జగన్’ అని అనడం ఆసక్తిదాయకంగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో వాట్సాప్ లో వైరల్ గా మారింది.
తెలుగుదేశం పార్టీకి మీ ఓటు వేసి, వేయించి ప్రార్థన అని చెప్పిన తర్వాత చరిత కాస్త విరామం తీసుకుని ఒక్కసారిగా ‘జై జగన్’ అనే శారు. దీంతో అక్కడున్న వాళ్లు కూడా భళ్లున నవ్వారు. ఆఖరికి చరితమ్మ కూడా, తను ఏం నినదించానో అర్థం చేసుకుని, ఆమె మళ్లీ చంద్రబాబు అని కవర్ చేసే ప్రయత్నం చేసుకున్నారు. ఇలా వైసీపీ నుండి వచ్చిన కొంతమంది నేతలు జై జగన్ అంటుండంతో చంద్రబాబు కొంతమేర అసహనం వ్యక్తం చేస్తున్నాడు.
https://twitter.com/Vote_For_Fan/status/1115486511699333120








