టీడీపీ పగ్గాలు అందుకోనున్న జూనియర్ ఎన్టీఆర్.. జోరుగా ఊహాగానాలు!

- Advertisement -

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు టీడీపీని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన చొరవతో టీడీపీ ప్రభత దేశవ్యాప్తం అయింది.

అయితే, ప్రస్తుతం ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణలోనూ ఆ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.

చదవండి: చంద్రబాబుకు బిగ్ షాక్! పిలిచినా రాని తోట త్రిమూర్తులు, సీఎం జగన్‌తో భేటీ…?

మరోవైపు, చంద్రబాబు తర్వాత ఆ పార్టీ పగ్గాలు అందుకోబోయేది ఎవరన్న ప్రశ్న ఇటు నాయకులను, అటు కార్యకర్తలు, అభిమానులను తొలిచేస్తోంది.

తాజాగా, ఈ ప్రశ్నలకు సమాధానం అన్నట్టు గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.

గతంలో టీడీపీకి ప్రచారం నిర్వహించి తాత ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. త్వరలోనే టీడీపీ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లబోతోందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

జూనియర్ వస్తే.. లోకేశ్ పరిస్థితి?

అదే జరిగితే చంద్రబాబు కుమారుడు లోకేశ్ పరిస్థితి ఏంటన్నది కూడా చర్చనీయాంశమైంది. 2019 ఎన్నికలకు ముందు పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులు, అభిమానులు, చంద్రబాబు కూడా ఎన్టీఆర్‌ను కోరినట్టు వార్తలు వచ్చాయి.

అయితే, ప్రస్తుతం ఆ పనిచేయలేనని, పార్టీకి తన సేవలు అవసరమైనప్పుడు తప్పకుండా వస్తానని సున్నితంగా చెప్పి వారి అభ్యర్థనను తిరస్కరించినట్టు వార్తలు వినిపించాయి.

చదవండి: ముంబైలో రెడ్ అలర్ట్! విమానాలు, రైళ్లు రద్దు.. మరో 24 గంటలు ఇంతే…

తన తాత స్థాపించిన పార్టీ కోసం తన ప్రాణం ఉన్నంత వరకు కష్టపడతానని గతంలో ఎన్టీఆర్ పలుమార్లు చెప్పుకొచ్చాడు. తాజాగా, ఎన్టీఆర్ పేరు టీడీపీ శ్రేణుల్లో మరోమారు చర్చకు వచ్చింది.

చంద్రబాబు తర్వాత ఆ పార్టీని నిలబెట్టగల సత్తా ఎవరికి ఉందన్న చర్చ మొదలైంది. మాజీ మంత్రి లోకేశ్ ఉన్నా, పార్టీని నిలబెట్టేంత సత్తా ఆయనకు లేదని అంటున్నారు.

పార్టీని మళ్లీ బలోపేతం చేసి పూర్వవైభం తీసుకురాగల సత్తా ఒక్క ఎన్టీఆర్‌కే ఉందని అంటున్నారు. అయితే, మరో వాదన కూడా వినిపిస్తోంది. రాజకీయాల్లో అంతగా అనుభవం లేని ఎన్టీఆర్‌కు పగ్గాలు అప్పజెప్పినా సమర్థంగా నడిపించడం కష్టమేనన్నది మరికొందరి వాదన.

చదవండి: ఐఎన్ఎక్స్ కేసు: సుప్రీంకోర్టులో చిదంబరానికి ఎదురుదెబ్బ! బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ…

ఇటీవల లోకేశ్ మాట్లాడుతూ.. టీడీపీ ఒకరి సొత్తు కాదని, పార్టీ కోసం పనిచేసేందుకు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని, ఎన్టీఆర్ ఇందుకు మినహాయింపు కాదని పరోక్షంగా ఆహ్వానించారు.

ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఎన్టీఆర్ వచ్చినా పార్టీలో ఎటువంటి సమస్య ఉండబోదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాత స్థాపించిన పార్టీ కోసం ఎన్టీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -