
- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఖరారు చేసారు . ఈరోజు గవర్నర్ నరసింహన్ జగన్ అందిజేసిన లిస్ట్ ప్రకారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు . అయితే తన మంత్రివర్గంలో ఏకంగా 5 మందిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది .
అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ తన కేబినెట్ ని రూపొందించాడు జగన్ . అంతేకాదు మొదటి నుంచీ పార్టీకి విధేయులుగా ఉన్నవారు, కష్టకాలంలో తన వెంట నడిచినవారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు.
వైఎస్ మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి ఆశించిన భంగపడ్డ జగన్, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వేరుకుంపటి పెటుకున్నారు. వైసీపీ ఆవిర్భావం తరువాత జగన్మోహన్ రెడ్డి వెన్నంటి ఉన్నవారికి ప్రస్తుత ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి దక్కింది.
వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజాకు మంత్రి పదవి దక్కలేదు. తొలి నుండి రోజాకు పదవి ఖాయమనే ప్రచారం జరిగింది. వైసీపీ అధికారంలోకి వస్తే రోజా హోం మంత్రి అవుతారని జోరాగా ప్రచారం సాగింది. ఆ తరువాత రోజాకు స్పీకర్ అని కొందరు, డిప్యూటీ స్పీకర్ అని మరి కొందరు చెప్పుకొచ్చారు.
ఇక, మంత్రి వర్గ విస్తరణకు ముందు జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొనటానికి వచ్చిన రోజా సైతం తాను మంత్రి పదవి కోరలేదని, అయినా జగన్ తన విధేయతను గుర్తిస్తారని, తనకు మంత్రిగా అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేసారు. అయినా తుది కూర్పులో మాత్రం రోజాకు మంత్రి గా అవకాశం దక్కలేదు.
అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే రోజా ని జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకోకపోవడం తో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.అలాగే మరికొందరు మాత్రం జగన్ ఏం చేసినా ఆలోచించే చేస్తారు అని చెప్తున్నారు.
ఎవరి వాదనలు వారు వినిపిస్తున్న జగన్ రోజా ని తన క్యాబినెట్ లోకి తీసుకోకపోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అసలు రోజా విషయంలో జగన్ వైఖరి ఏంటి…ఎందుకు క్యాబినెట్
లోకి తీసుకోలేదు అని విషయాలని ఇప్పుడు చూద్దాం…
లోకి తీసుకోలేదు అని విషయాలని ఇప్పుడు చూద్దాం…
ఇక విషయానికొస్తే…జగన్ విశ్వసనీయత పై అందరికి నమ్మకం ఉంది. ఈ నమ్మకంతోనే రోజాకి మంత్రి పదవి ఖాయం అని అనుకున్నారు. కానీ , రోజాకి మంత్రి పదవి ఇవ్వకపోవడం పై జగన్ మాస్టర్ ప్లాన్ తెలిసి రాజకీయ ఉద్దండులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఈ ఎన్నికలలో వైసీపీ భారీ మెజారిటీ స్థానాలని గెలుచుకుంది. దీనితో మామూలుగానే మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎల్పీ సమావేశంలో రెండున్నర ఏళ్ల తరువాత క్యాబినెట్ లో 90 శాతం మార్పులు ఖాయం అంటూ ముందే చెప్పాడు.
దీనితో తోలి విడత లో క్యాబినెట్ లో చోటు దక్కని వారికీ రెండో విడత విస్తరణ లో చోటు ఇస్తామని హామీ ఇచ్చాడు. ఇకపొతే ఈ విధంగా చూస్తే రోజా కి మలి విడత క్యాబినెట్ లో చోటు ఖాయం. కానీ ఇక్కడే జగన్ తన మాస్టర్ మైండ్ ఉపయోగించాడు. ఈ రెండున్నర ఏళ్ల కాలం కంటే రాజకీయంగా చివరి రెండున్నరేళ్ల కాలమే చాలా కీలకం.
ఎన్నికలకి వెళ్లే ముందు చేసే మంచి పనులనే ప్రజలు బాగా గుర్తిస్తారు…దీనికి మంచి ఉదాహరణ మాజీ సీఎం చంద్రబాబు ఎన్నికలకి ముందు ఇచ్చిన పసుపు కుంకుమ పథకం. ఈ పథకం ద్వారా ప్రతి డ్వాక్రా మహిళకి 10 వేలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే టీడీపీ కి ఆ మాత్రం సీట్లు అయినా దక్కాయి.
దీనితోనే మొదటి రెండున్నర ఏళ్ల కాలం ఎలా ఉన్నా కూడా చివరి రెండున్నర ఏళ్ల సమయం మంచి వాక్చాతుర్యం ఉన్న నేతలు మంత్రులుగా ఉంటె , పార్టీ పై ప్రజలలో మంచి సదా అభిప్రాయం ఏర్పడుతుంది. దీనితోనే రోజా లాంటి ఫైర్ బ్రాండ్ నేతకి విస్తరణలో భాగంగా రెండో సారి హోంమంత్రి పదవి కేటాయించబోతున్నాడు. దీనితోనే మొదటి క్యాబినెట్ విస్తరణలో రోజాకి చోటు ఇవ్వలేదు.
- Advertisement -








