ఆంధ్రా.. అమెరికా అయ్యే ఛాన్స్ లేనట్లే.. కేఏ పాల్ కథ ఇక కంచికే!?

- Advertisement -

అమరావతి: కేఏ పాల్.. తెలంగాణ, ఏపీ ఎన్నికల సమయంలో ఉవ్వెత్తున ఎగసిపడిన ఓ కామెడీ సునామీ. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎక్కువైపోయాయి అనుకుంటున్న తరుణంలో ‘ప్రజాశాంతి’ పార్టీ అంటూ ఊహించని విధంగా తెరపైకి వచ్చారు కేఏ పాల్. తన పార్టీకి ప్రజలు అధికారం అప్పగిస్తే.. ఆంధ్రాని అమెరికా చేస్తానంటూ తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. 

తనవైన పంచ్ డైలాగులతో, ఎవరికీ సాధ్యం కాని హవభావాలతో అందర్నీ తెగ నవ్వించేసిన కేఏ పాల్, చివరి నిమిషంలో మాత్రం ఏడ్చేశారు.  అదేంటోగానీ ఆయన ఏడ్చినా చూసేవాళ్లకు నవ్వే వచ్చింది. ఊహించినట్లుగానే కేఏ పాల్ ఎన్నికల రణ క్షేత్రం నుంచి సైలెంట్‌గా నిష్క్రమించారు.

చివరి రోజున నాటకీయ పరిణామం…

భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెండు రోజుల క్రితం నామినేషన్ వేశారు కేఏ పాల్. అయితే అఫిడవిట్ మాత్రం ఇవ్వలేదు. అఫిడవిట్ దాఖలు చేయడానికి సోమవారం చివరి రోజు. కానీ ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకోవడం ఆలస్యమైంది. 

నామినేషన్ల ప్రక్రియ ముగిసే చివరి రోజు, అందునా మధ్యాహ్నం 3 గంటల వరకు కేఏ పాల్ సంబంధిత కార్యాలయానికి చేరుకోకపోవడం, అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో ఆయన అప్లికేషన్ తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో కేఏ పాల్ కథ అర్థాంతరంగా భీమవరంలోనే ముగిసింది.

కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణకు గురైన సందర్భంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారితో ఆయన తీవ్ర వాగ్వాదానికి కూడా దిగారు. నరసాపురంలో ఎంపీ నామినేషన్ పత్రాలను తీసుకోవడంలో చాలా ఆలస్యంగా చేశారని,  అందుకే తాను భీమవరం రావడం ఆలస్యమైందని కేఏ పాల్ వాపోయారు.

ఎన్నికల్లో తాను ఎక్కడ గెలుస్తానో అన్న భయంతోనే భీమవరం ఆలస్యంగా చేరుకునేలా చేశారని చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ లను కేఏ పాల్ విమర్శించారు కూడ. అంతేకాదు, తాను భీమవరంలో పోటీ చేయలేకపోయినా నరసాపురం ఎంపీగా గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తానని అన్నారు.

తాను ఏడుస్తూ.. అందరినీ నవ్వించి…

భీమవరంలో పోటీ చేయలేకపోయినందుకు చాలా బాధపడుతున్నానంటూ కాసేపు వెక్కి వెక్కి ఏడ్చారు పాల్. కానీ అదేం విచిత్రమో.. ఆయన ఏడుస్తున్నా కానీ అందరికీ నవ్వే వచ్చింది.

ఐదేళ్ల క్రితం కూడా ఇంతే. తన పార్టీ నుంచి పలువురు అభ్యర్థులు పోటీ చేస్తారని పాల్ ప్రకటించారు. కట్ చేస్తే.. అభ్యర్థుల సీడీ పోయిందని చెప్పి హఠాత్తుగా  మాయమైపోయారు. ప్రస్తుతానికి వస్తే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలోనూ.. కేఏ పాల్  కామెడీ ఎపిసోడ్ సమాప్తం అయినట్లే అనిపిస్తోంది. అంతేగా.. అంతేగా!

సంబంధిత వార్తలు

కేఏ పాల్‌కు ఊహించని షాక్! నామినేషన్‌ తిరస్కరించిన అధికారులు, అక్కడా డౌటే…
‘‘చిరంజీవి ఇరగదీసేవాడు.. తమ్ముడికి అదీ రాదు’’: కేఏ పాల్ ఇమిటేషన్, నవ్వులే నవ్వులు..
ఏపీని అమెరికాగా మార్చేస్తా: కేఏ పాల్, రెండు స్థానాల్లోనూ పోటీ.. నాగబాబు, పవన్ కళ్యాణ్‌లతో…
స్టేట్ బ్యాంక్ లో కేఏ‌ పాల్ హల్‌చల్! ఆ డబ్బు నాదే ఇవ్వండి!
- Advertisement -