23.4 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ జగన్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయా!?

జగన్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయా!?

sensational things about the jagan News, AP Latest Political News, YCP Latest News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు అయిన వైఎస్ జగన్‌కు సంబంధించి మరిన్ని సంచలన వార్తలు వెలుగులోకి  రాబోతున్నాయా? ఫరూక్ అబ్దుల్లా స్వీయ అనుభవం వెల్లడించడంతో ఏపీ రాజకీయాల్లోనూ, దేశంల్లోనూ పెద్ద బాంబు పేలబోతోందా?

పదవి కోసం జగన్ ఎంత డబ్బైనా వెచ్చించగలడని ఎలా చెప్పగలుగుతున్నారు? త్వరలో ఏపీకి రానున్న పవార్, దేవెగౌడ లాంటి నేతలు వైఎస్ జగన్ గురించి ఎలాంటి బాంబులు పేల్చబోతున్నారు? అసలు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే ఎందుకు దోస్తీ చేస్తున్నట్లు?

వైఎస్ జగన్ గురించి.. వాళ్లు ఏం చెప్పబోతున్నారు?

ఇక మరో వారం రోజుల్లోనే ఏపీ రాజకీయాల్లో సంచలన అంశాలు బైయటికి రాబోతున్నాయి. నాటి జగన్ లీలలను జాతీయ నేతలు ద్వారా తెలుసుకునే అవకాశం లభించబోతోంది. ఫరూక్ చెప్పిన నిజాలు, పవార్ చెప్పబోయే వాస్తవాలు, అఖిలేష్, దేవెగౌడ పేల్చబోయే బాంబుల కోసం ఏపీ జనం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా చేసిన ఒక కామెంట్ దేశ రాజకీయాలనే కుదిపేస్తోంది. ఫరూక్ ఒకరోజు పర్యటనలోనే మేజర్ ఇష్యూ బయటికి వచ్చేసింది. ఇక తరువాత ఏం జరగబోతోందన్నదే పెద్ద ప్రశ్న.

తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారానికి వచ్చే నేతలు ఏం చెప్పబోతున్నారు? త్వరలో రాబోయే ఎన్సీపీ నేత శరద్ పవార్.. ఇంతకంటే పెద్ద బాంబు పేల్చబోతున్నారా? అసలు పవార్ ఏం చెప్పబోతున్నారు?

వైఎస్ జగన్‌ విషయంలో ప్రాంతీయ పార్టీలు ఆమడ దూరం ఉంటున్నాయి. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ పెట్టాలనుకున్న పార్టీలు సైతం ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోయినా జగన్‌ను మాత్రం దూరం పెట్టాయి. చూడాలి మరి.. ఇతర పార్టీల కీలక నేతలు వచ్చి ఇంకా ఏమేం విషయాలు బయటపెడతారో!

- Advertisement -