25.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ తన గెలుపుపై పక్కా లెక్కలు చెబుతున్న టీడీపీ సీనియర్ నేత…

తన గెలుపుపై పక్కా లెక్కలు చెబుతున్న టీడీపీ సీనియర్ నేత…

TDP Senior leader News, AP Election Updates, AP Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏప్రిల్ 11 న హోరాహోరీగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ-వైసీపీలు గెలుపుపై గట్టి ధీమాతో ఉన్నాయి. ఇప్పటికే తాము అంటే తాము అధికారంలోకి వస్తామని ఆ పార్టీల నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.

ఇక వీరికి ఏ మాత్రం తగ్గకుండా జనసేన కూడా గెలుపు తమదే అని చెబుతుంది. అయితే వీరి ధీమా ఎంతవరకు నిజమనేది మే 23న తెలుస్తోంది అనుకోండి. ఇక ఈలోపు గెలుపుపై ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి.

చదవండి: ఏపీలో మరో లేటెస్ట్ సర్వే హల్‌చల్.. వైసీపీ విజయం ఖాయమేనా!?

రాజమహేంద్రవరం రూరల్‌ నాదే అంటున్న బుచ్చయ్య  

ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ రాజమండ్రి రూరల్ నుంచి బరిలోకి దిగిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తన విజయం మీద బాగా ధీమాగా వున్నారు. 2014 ఎన్నికల్లో బుచ్చయ్య రూరల్ నుంచి సుమారు 25 వేల మెజారిటీతో గెలిచారు. ఈసారి కూడా అదే మెజారిటీతో గెలుస్తానని బుచ్చయ్య లెక్కలు చెబుతున్నారు.

2014లో టీడీపీకి బీజేపీ, జనసేన మద్ధతు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. అయిన సరే గెలుపు తనదేనని ఆయన చెబుతున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి వైసిపి, జనసేన కాపు అభ్యర్థులనే నిలబెట్టాయి. వీరిద్దరి నడుమ కాపు సామాజిక వర్గ ఓట్ల చీలిక సునాయాసంగా తనను గట్టున పడేస్తాయని గోరంట్ల లెక్కలు వేస్తున్నారు.

పైగా బీసీ ఓటు బ్యాంక్ తనకు పూర్తి అండగా నిలబడిందని, దీంతోపాటు ప్రభుత్వ పథకాలు తనని భారీ మెజారిటీ గెలిపిస్తాయని అంటున్నారు. మరి చూడాలి బుచ్చయ్య ధీమా ఏ మేర నిజమవుతుందో.

చదవండి: ఏపీలో జగన్ ప్రభావం అప్పుడే మొదలైందా? కసరత్తులు ప్రారంభించిన జిల్లా అధికారులు!

 

- Advertisement -