26.6 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అది చెప్పడానికి విజయసాయిరెడ్డి ఎవరు?: సోమిరెడ్డి ఫైర్

అది చెప్పడానికి విజయసాయిరెడ్డి ఎవరు?: సోమిరెడ్డి ఫైర్

- Advertisement -

అమరావతి: ఎన్నికల సంఘం అనుమతితో నేడు సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.  ఈ సమావేశంలో కరవు, ఫొణి తుఫాను, మంచినీటి సరఫరా, ఉపాధి పనులను సమీక్షించనున్నారు.

అయితే కేబినెట్ భేటీపై  వైసీపీ నేత విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు పనులను నిర్వహిస్తున్న టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కి అక్రమంగా రూ.400 కోట్లు చెల్లించేందుకే కేబినెట్ సమావేశం పెడుతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

చదవండి: అమరావతికి తరలిన వైసీపీ ప్రధాన కార్యాలయం! ఫర్నీచర్ తరలింపు పూర్తి!

అయితే పోలవరం ప్రాజెక్టు చెల్లింపులన్నీ నిలిపివేయాలన్న ఆయన… కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులపై ఆడిటింగ్ జరిపిన తర్వాతే పేమెంట్స్ చేయాలని డిమాండ్ చేశారు.

‘‘ఈసీ వ్యవహారాల్లో వైసీపీ జోక్యం..’’

ఈ నేపథ్యంలోనే  విజయసాయిరెడ్డిపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఎన్నికల ప్రవర్తన నియమావళి పేరుతో ఈసీ అభివృద్ధిని అడ్డుకుంటోందని, అసలు కేబినెట్ ఆమోదించిన బిల్లులు ఇవ్వవద్దని చెప్పడానికి విజయసాయిరెడ్డి ఎవరని ప్రశ్నించారు.

దీని కారణంగా పోలవరం ప్రాజెక్టు కింద రైతులు ఓ సీజన్‌ను కోల్పోతారని, ఈసీ వ్యవహారాల్లో వైసీపీ జోక్యం ఎక్కువ అయిందని విమర్శించారు. అలాగే రుణమాఫీ నాలుగో విడత కింద రూ.500 కోట్లు విడుదల చేస్తే ఈసీ అడ్డుకోవడం ఏంటని సోమిరెడ్డి ప్రశ్నించారు.

చదవండి: జగన్ సంచలన నిర్ణయం.. చంద్రబాబుకి మేలు చేయనుందా!?
- Advertisement -