23.3 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ లోటస్‌పాండ్‌లో అప్పుడు చొక్కా చించుకున్న విషయం గుర్తు లేదా?: జగన్‌కు బుద్ధా వెంకన్న సూటిప్రశ్న

లోటస్‌పాండ్‌లో అప్పుడు చొక్కా చించుకున్న విషయం గుర్తు లేదా?: జగన్‌కు బుద్ధా వెంకన్న సూటిప్రశ్న

- Advertisement -

అమరావతి: ఏపీలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ట్విట్టర్ వార్ రోజురోజుకు ముదురుతోంది. వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి చేసే విమర్శలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తున్నారు.

విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై విజయసాయి చేసిన వ్యాఖ్యలను తిప్పి కొడుతూ.. పోలీసులపై, సీబీఐపై జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలను గుర్తు చేశారు.

‘ఏ చట్టం కింద తనను చంచల్ గూడ జైలుకి తీసుకెళ్లారని.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని.. సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అంటూ జగన్ లోటస్ పాండ్‌లో చొక్కా చించుకున్న విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు.

ప్రజల్లోకి వెళ్లకుండా తనను ఆపడానికి ఏ చట్టం ఉందని చంద్రబాబు అడుగుతున్నారని.. అంతేకానీ వైఎస్ జగన్‌లా దొంగతనం చేసి దొరికిపోయి ఏ చట్టం కింద జైలుకి తీసుకెళ్తున్నారు అని అడగలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఆనాడు పెట్టుబడులు రాకుండా ఉత్తరాంధ్రని దెబ్బ తియ్యడానికి జగన్ వెళ్లారని.. ఇప్పుడు జీఎన్ రావు కమిటీతో అడ్డమైన రాతలు రాయించి పెట్టుబడులు తిప్పి పంపుతున్నారని విమర్శించారు.

- Advertisement -