
- Advertisement -
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దుల్లో రోడ్డుపై నిర్మించిన అడ్డుగోడలను అధికారులు తొలగించారు.
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా పలమనేరు-గుడియాత్తం, నంగమంగళం-వేలూరు, చిత్తూరు-తరుత్తణి మార్గాల్లోని అంతర్రాష్ట్ర సరిహద్దు రహదారుల్లో తమిళనాడు అధికారులు ఆదివారం అడ్డుగోడలు నిర్మించారు.
ఈ గోడల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ చిత్తూరు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ భరత్‌గుప్తాకు ఫిర్యాదు చేశారు.
దీంతో తమిళనాడు అధికారులతో మాట్లాడిన కలెక్టర్ గోడలను తొలగించాలని కోరారు. ఆయన సూచనతో తమిళనాడు అధికారులు సోమవారం మూడు ప్రాంతాల్లో నిర్మించిన అడ్డు గోడలను తొలగించారు.
- Advertisement -








