25.6 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఓటు వేసిన అనంతరం షర్మిల, భారతి సంచలన వ్యాఖ్యలు…

ఓటు వేసిన అనంతరం షర్మిల, భారతి సంచలన వ్యాఖ్యలు…

- Advertisement -

అమరావతి: దేశంలో గురువారం (ఏప్రిల్ 11) ఉదయం 7 గంటలనుండి సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 20 రాష్ట్రాలలోని 91 లోక్‌సభ స్థానాలతో పాటుగా, అసెంబ్లీ స్థానాలకి పోలింగ్ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఓటర్లలో తెచ్చిన మార్పుతో పెద్ద ఎత్తున జనం పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

పోలింగ్ ప్రశాంతంగానే ప్రారంభమైనప్పనటికీ, ఏపీలోని పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య రాళ్లు రువ్వుకున్న ఘటనలు, ఘర్షణలు తలెత్తాయి.

అక్కడక్కడా కొన్ని ఈవీఎంలు సరైన సమయానికి పనిచేయకపోవడంతో కొంతమంది ఈసీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

‘‘త్వరలో రాజన్న రాజ్యం…’’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల కొద్దిసేపటి క్రితం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్‌ నుంచి బయటికి వచ్చిన తరువాత షర్మిల మాట్లాడుతూ.. త్వరలో రాజన్న రాజ్యం రాబోతుందని, 140 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ .. ‘‘ఆ దేవుడి ఆశీస్సులు, మీ చల్లని దీవెనలతో జగన్ అన్న సీఎం అయితే, ఇచ్చిన ప్రతి హామీని నిరవేర్చుతాం..’’ అని వ్యాఖ్యానించారు.

ఎప్పుడూ లేని విధంగా నేడు పెద్ద ఎత్తున యువత ఓటింగ్ లో పాల్గొనడం మంచి పరిణామమని షర్మిల అన్నారు. అలాగే జగన్ ప్రకటించిన నవరత్నాలకి కూడా ప్రజలలో మంచి స్పందన వచ్చిందని, జగన్ సీఎం అయితే నవరత్నాలలో ఉండే ప్రతిదాన్ని తప్పక అమలులోకి తెస్తామని ఆమె చెప్పారు. 

మన అధినేతకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడిగిన మాటకి కట్టుబడి ఏపీ ప్రజలు జగన్‌కి పట్టం కట్టబోతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోందని షర్మిల వ్యాఖ్యానించారు. ఓడిపోతామనే భయంతో కొన్నిచోట్ల వైసీపీ నేతలపై, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని కూడా ఆమె ఆరోపించారు.

దేవుడు ఆశీర్వదిస్తే 175 సీట్లు మాకే: వైఎస్ భారతి

జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ .. ధైర్యవంతుడైన యువ నాయకుడిని, విశ్వసనీయత ఉన్నవాడిని గెలిపించాలని యువ ఓటర్లను కోరారు. కడప జిల్లా పులివెందులలో ఓటేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఈసారి మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని పలువురు ప్రశ్నించగా ‘‘అదేముందమ్మా.. దేవుడు ఆశీర్వదిస్తే 175 సీట్లు కూడా వస్తాయి..’’ అని నవ్వుతూ భారతి సమాధానమిచ్చారు. నిజాయితీ, విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయం చేసేవారికి ఓటేయాలని ఆమె పిలుపునిచ్చారు.

- Advertisement -

1 COMMENT