21.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీకి క్యూ కడుతున్న సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు! కారణం అదేనా?

ఏపీకి క్యూ కడుతున్న సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు! కారణం అదేనా?

AP IAS Officers News, AP Jagan Updates, AP Political News , Newsxpressonline
- Advertisement -

అమరావతి: గత నెలలో ఏపీలో పోటా పోటీగా ఎన్నికలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈసారి ఇంకో ముఖ్య విషయం ఏమిటి అంటే ఎక్కడా కూడా ఓటర్లు తమ మనసులోని మాటను బయటపెట్టలేదు. దీనితో రాజకీయాలలో తలపండిన వారు సైతం , ఏపీలో ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

అయితే ప్రస్తుతం వస్తున్న జాతీయ , రాష్ట్ర సర్వే ఫలితాలలో ఏపీలో అధికారం వైసీపీదే అని తేల్చిచెప్తున్నాయి. దీనితో పదేళ్ళ క్రితం వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన అధికారులు ఏపీ వైపు తొంగి చూస్తున్నారు.

ఏపీలో వై ఎస్ జగ‌న్ అధికారంలోకి వ‌స్తారనే ప్ర‌చారంతో, ఏపి కేడ‌ర్‌కు చెంది కేంద్ర స‌ర్వీసుల్లో ఉన్న ఐఏయ‌స్ఐ, పీఎస్ అధికారులు ఏపీకి తిరిగి వచ్చేందుకు ద‌ర‌ఖాస్తులు చేసుకుంటున్నారు. వారిలో అనేక మంది సీనియ‌ర్ అధికారులు కూడా ఉన్నట్టు సమాచారం.

చదవండి:  టీడీపీ, కాంగ్రెస్‌లకు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం!

తాజాగా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే ఏపీకీ పెట్టుబ‌డులు వ‌స్తాయా, అధికారులు ఏవ‌రైనా ఏపీలో ప‌ని చేస్తారా అంటూ టీడీపీ ముఖ్య నేత‌లు ప్ర‌చారం చేసారు. కానీ, ఇప్పుడు అంచ‌నాలు తలక్రిందులు అవుతున్నాయి.

ఏపీ కేడ‌ర్ నుండి ఉద్యోగంలో చేరి, ఇక్క‌డ ప‌రిస్థితుల కార‌ణంగా కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిన కొంద‌రు అధికారులు తిరిగి ఏపీ కి వ‌చ్చేందుకు సిద్ద‌మ‌య్యారు. దీనికోసం ఇప్పటికే మంత‌నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

అలాగే మ‌రి కొంద‌రు ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌స్తే తాము ఏపీకీ తిరిగి వ‌స్తామ‌ని ధ‌ర‌ఖాస్తు చేసుకున్న వారిలో ఐఏయ‌స్‌తో పాటుగా ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వారిలో ఏపీలో ఉన్న‌ప్పుడు సంచ‌ల‌న అధికారిగా పేరున్న ఐపిఎస్ అధికారి పిఎస్ఆర్ సీతారామాంజ‌నేయులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఆయన ప్ర‌స్తుతం ఆయ‌న డిప్యుటేష‌న్ పైన కేంద్ర స‌ర్వీసుల్లో బిఎస్ఎఫ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయ‌న తిరిగి ఏపీకీ వ‌స్తే అద‌న‌పు డీజీ హోదా ద‌క్క‌నుంది.దీనితో అయన జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా ఉంటార‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం జోరందుకుంది.

అదే విధంగా సీఆర్పీఎఫ్ ప్ర‌త్యేక డిజీగా ఉన్న విఎస్‌కె కౌముది, కేంద్ర స‌ర్వీసుల్లో ఉన్న మ‌నీశ్ కుమార్ సిన్హా, అంజ‌నా సిన్హా, ధ‌ర్మారెడ్డి వంటి వారు ఏపీకీ తిరిగి వ‌చ్చేందుకు ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వారంతా జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే త‌మ‌కు ప్రాధాన్య‌త ద‌క్కుతుంద‌నే అంచ‌నాతో సొంత రాష్ట్రంకు తిరిగి రావాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

చదవండి:  ఏపీ కేబినెట్‌ భేటీ పై స్పదించిన సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం !
- Advertisement -