
- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తొలిసారిగా నిరసన సెగ తగిలింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్.. వ్యవసాయం, దాని అనుబంధ విభాగాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో 2018 డీఎస్సీ అభ్యర్థులు, ఏఎన్ఎంలు సీఎం క్యాంపు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
గత ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. కొత్త ప్రభుత్వమయినా తమకు న్యాయం చేయాలని కోరారు. వీరి ఆందోళనను క్యాంపు ఆఫీసు అధికారులెవరూ పట్టించుకోలేదు.
దీంతో వారు ఆందోళన మరింత ఉధృతం చేశారు. ఓ దశలో నిరసనకారులు క్యాంపు కార్యాలయం ప్రాంగణంలోకి చొచ్చుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే, వారు లోనికి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
చదవండి: అన్నదాత సుఖీభవ పథకం రద్దు! జగన్ మరో సంచలన నిర్ణయం!
- Advertisement -








