26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌! డేట్ ఫిక్స్ చేసిన ఈసీ!

ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌! డేట్ ఫిక్స్ చేసిన ఈసీ!

ap repoling dat is fixed
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఐదు చోట్ల రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో ఈ నెల 6న రీపోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయించింది.

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మొత్తం ఐదు చోట్ల రీపోలింగ్‌ జరిపే బూత్‌లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఈసీఐ ఆదేశాలు జారీచేసింది. ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల పోలింగ్‌లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు తలెత్తడంతో పాటు మరికొన్నిచోట్ల ఈవీఎంలలో ఇబ్బందులు తలెత్తిన దృష్ట్యా రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే.

రీపోలింగ్‌ ఎక్కడెక్కడంటే..?

గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కేసానుపల్లిలో 94వ బూత్‌, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులో 244వ బూత్‌తో పాటు నెల్లూరు నియోజకవర్గంలోని పల్లెపాలెంలో ఇసుకపల్లి 41వ బూత్‌, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలో 197వ పోలింగ్ బూత్‌తో పాటు యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో 247వ పోలింగ్‌ కేంద్రంలో ఈ నెల 6న రీపోలింగ్‌ జరగనుంది.

- Advertisement -