ఏపీ సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు

12:55 pm, Fri, 13 September 19

అమరావతి: బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సింధును జగన్ అభిందనందించారు.

జగన్‌ను కలిసిన వారిలో సింధు తల్లిదండ్రులతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని జగన్ అభిలషించారు.

వైజాగ్‌లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు 5 ఎకరాల భూమి ఇచ్చేందుకు జగన్ అంగీకరించారు. పీవీ సింధు మాట్లాడుతూ సీఎం జగన్‌ను కలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. అన్ని రకాల, సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపింది.