23.4 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో 13వ రోజూ కొనసాగుతున్న ఆందోళనలు

అమరావతిలో 13వ రోజూ కొనసాగుతున్న ఆందోళనలు

- Advertisement -

అమరావతి: మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 13 రోజూ కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. మహిళలు, రైతులు, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అటువైపు వచ్చే రహదారిని రైతులు దిగ్భందించడంతో పోలీసులు మోహరించారు. ఐడీ కార్డులున్న వారినే పోలీసులు అనుమతిస్తున్నారు. తుళ్లూరులోని తులసీ థియేటర్స్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నారు. రోడ్లపైనే వంట వార్పు నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ స్తంభించింది.

మందడంలో రైతులు చేస్తున్న ధర్నాకు ఆంధ్రా మేధావుల సంఘం మద్దతు ప్రకటించింది. ఈ సందర్బంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజధాని వికేంద్రీకరణకు అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. మిగతా ప్రాంతాల్లో రాజధాని డిమాండ్ లేనప్పుడు తరలించడం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

- Advertisement -