34.1 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ కలవరపెడుతున్న అత్యాచారాలపై గల్లా జయదేవ్ వరుస ట్వీట్లు

కలవరపెడుతున్న అత్యాచారాలపై గల్లా జయదేవ్ వరుస ట్వీట్లు

- Advertisement -

అమరావతి: దేశంలో పెరుగిపోతున్న అత్యాచారాలపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆవేదన వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. మహిళలు, బాలికలపై వేధింపులు, అత్యాచారాలు, దాడుల కేసుల సంఖ్య పెరగడం విచారకరమని జయదేవ్ అన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

నేరస్థులను శిక్షించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా వీటికి అడ్డుకట్ట పడకపోవడం బాధాకరమన్నారు. వీటని నిరోధించేందుకు సమాజం కూడా తమ వంతు ప్రయత్నం చేయాలని అన్నారు. తమను తాము ఎలా రక్షించుకోవాలో అమ్మాయిలకు నేర్పాలని, చిన్న వయసు నుంచే మహిళలను గౌరవించడాన్ని అబ్బాయిలకు నేర్పాలని సూచించారు. అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎదుర్కొనేలా మహిళలకు అండగా నిలవాల్సిన కనీస బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.

- Advertisement -