ప్రొఫెసర్ నాగేశ్వర్ సర్వే: ఏపీలో అధికారం ఎవరిదంటే?

4:14 pm, Mon, 20 May 19
Exit polls Latest News, prof k nageshwar, AP Elections News, Newsxpressonline

హైదరాబాద్: ఆదివారం సాయంత్రం నుంచి అనేక ఎగ్జిట్ పోల్స్ ఏపీ ఎన్నికలపై తమ అంచనాలని వెల్లడిస్తూ ఉన్నాయి. వాటిల్లో కొన్ని సర్వేలు టీడీపీకి అనుకూలంగా ఉంటే మరికొన్ని సర్వేలు వైసీపీ గెలుస్తాయని చెప్పాయి.

ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ కూడా ఏపీ ఎన్నికలపై తన అంచనాలని వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 98 నుంచి 102 సీట్ల వరకు రావొచ్చని అంచనా వేశారు. అయితే టీడీపీకి ఈ స్థాయిలో సీట్లు గెలిచేందుకు అవకాశాలు చాలా తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే జనసేనకు 3 నుంచి 5 సీట్లు వస్తాయని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లోనూ వైసీపీకి గణనీయమైన స్థాయిలో 15 సీట్ల వరకు రావొచ్చని వెల్లడించారు. అయితే ఆయన ఇంకో ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. వాస్తవానికి జనాల్లో చంద్రబాబుపై వ్యతిరేకత లేకపోయినా, జగన్ కు ఒక్క చాన్స్ ఇచ్చి చూడాలన్నది ఎక్కువ ప్రభావం చూపిందని నాగేశ్వర్ విశ్లేషించారు.

చదవండి:  నేను ఓడిపోతా కానీ.. మా పార్టీకి 30 సీట్లు గ్యారెంటీ: కేఏ పాల్