26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, 10లక్షల్య ఆరోగ్య బీమా: జనసేన మేనిఫెస్టో ఇదే..

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, 10లక్షల్య ఆరోగ్య బీమా: జనసేన మేనిఫెస్టో ఇదే..

- Advertisement -

అమరావతి: జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదాలతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు.

ప్రజాసంక్షేమం, సంపద పంపిణీలో సమాన అవకాశాలు, నిరుద్యోగ సమస్య నిర్మూలన, రైతులు, మత్స్యకారుల రక్షణ కోసం చట్టాలు, పేదరికం నిర్మూలన వంటి ప్రధాన అంశాలు కలిగిన ఈ మేనిఫెస్టోలో 96 హామీలున్నాయి.

రైతులకు పెన్షన్…

విభాగాల వారీగా ప్రజలకు ఏమేం చేస్తామో జనసేన పేర్కొంది. రైతులకు రూ.8వేలు పెట్టుబడి సాయం, 60 ఏళ్ల పైబడిన రైతులకు పెన్షన్‌ ప్రకటించింది. రాయల సీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలా ప్రాంతాల వారీగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను పేర్కొంది.

ఒకటి నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఇంటర్మీడియట్‌ విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు పంపిణీ వంటివి మేనిఫెస్టోలో పొందుపరిచింది.  ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని జనసేన హామీ ఇచ్చింది.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, గృహిణులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500 నుంచి రూ.3500 వరకు నగదు జమ వంటి సంక్షేమ పథకాలను ప్రకటించింది.

పవన్‌ ఇంతకుముందే ప్రకటించినట్లుగా ఉద్యోగుల సీపీఎస్‌ రద్దు వంటి తదితర అంశాలను మేనిపెస్టోలో చేర్చారు. మొత్తం 96 హామీలను జనసేన పొందుపరిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే సంకల్పంతో ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆ పార్టీ తెలిపింది.

చదవండి: పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి: ఏపీ ప్రజలకు మాయావతి పిలుపు!
- Advertisement -