29.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ పవన్ కోసం రంగంలోకి సూర్యకాంతం.. ఉగాది తరువాతే మెగా హీరోస్!

పవన్ కోసం రంగంలోకి సూర్యకాంతం.. ఉగాది తరువాతే మెగా హీరోస్!

Suryakantha Latest Movie News, Niharika Latest News, Janasena News, Newsxpressonline
- Advertisement -

నరసాపురం: సూర్యకాంతం చిత్రంతో సినీ ప్రేక్షకులకు చేరువైన మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైంది. తన బాబాయ్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరఫున ప్రచారానికి నిహారిక బరిలోకి దిగారు. త్వరలోనే మెగా హీరోలు ఎన్నికల ప్రచారం చేపడుతారనే మెగా వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అసలు విషయం ఏమిటి అంటే… జనసేన పార్టీ నుండి నరసాపురం పార్లమెంట్ స్థానంలో పోటీకి దిగిన తండ్రి నాగబాబుతో నిహారిక విస్తృతంగా పర్యటిస్తున్నారు. తండ్రితోపాటు జీప్‌లో ప్రయాణిస్తూ జనసేన పార్టీకి అండగా నిలువాలని పిలుపునిస్తున్నారు. అలాగే ప్రాంత అభివృద్ధికి తండ్రి నాగబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని హుషారైన ప్రసంగాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకొంటున్నారు .

గోదావరి జిల్లాలో తండ్రి నాగబాబుతోపాటు నిహారిక మరో నాలుగు రోజులు పర్యటించనున్నట్టు సమాచారం . నిహారికతోపాటు నిర్మాత, పీఆర్వో సురేష్ కొండేటి కూడా నాగబాబు వెంట విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిర్మాత సురేష్ కొండేటి ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ నిహారిక ప్రచారానికి మంచి మద్దతు లభిస్తున్నది. మరో నాలుగు రోజులు ప్రచారం చేస్తారు. నాగబాబు విజయం సాధిస్తారు అని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీ ఎన్నికల్లో రాజకీయ గ్లామర్ తోడు కావడం ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. త్వరలోనే మెగా హీరోలు వరుణ్ తేజ్, అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు చేసుకొంటున్నట్టు తెలుస్తున్నది. వీరిద్దరూ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలో సుడిగాలి పర్యటనలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఉగాది పండుగ తర్వాత మెగా హీరోలు వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఆంధ్రాలో పర్యటించనున్నట్టు తెలిసింది. జనసేన పార్టీ తరుఫున పలు ప్రాంతాల్లో విస్తృత పర్యటనలు చేసే విధంగా జనసేన వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి.

రాష్ట్రం మొత్తంగా పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నందున ఆయన పోటీ చేస్తున్న భీమవరంలో, గాజువాకలో మెగా హీరోలు పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఇక పొతే మరో మెగా హీరో అయిన రామ్ చరణ్ ఏపీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వస్తారా, లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఉత్తర భారతంలో RRR షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

చదవండి: విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, 10లక్షల్య ఆరోగ్య బీమా: జనసేన మేనిఫెస్టో ఇదే..

- Advertisement -