30.3 C
Hyderabad
Thursday, October 15, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మనసులో కర్నూలే, సీమకు పూర్వ వైభవం: పవన్ కళ్యాణ్

మనసులో కర్నూలే, సీమకు పూర్వ వైభవం: పవన్ కళ్యాణ్

pawan kalyan
- Advertisement -

pawan kalyan
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అయినా… తన మనసుకు మాత్రం కర్నూలే రాజధాని అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు పవన్ కళ్యాణ్. దాదాపు రెండు గంటల పాటు విద్యార్థులతో మాట్లాడారు.

తాను ఓట్లు అడగడానికి రాలేదని, మార్పు కోసమే వచ్చానన్నారు పవన్ కళ్యాణ్. ప్రజల సమస్యలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని చెప్పారు.‌ యువకుల్లో ప్రశ్నించే ధైర్యం ఉండాలన్నారు. ఈరోజు మనకి రాజధాని అమరావతి అయినా.. తన మనసుకు మాత్రం కర్నూలే రాజధాని అని పవన్‌ వ్యాఖ్యానించారు.

అమరావతిని మించిన నగరంగా కర్నూలును తాను తీర్చిదిద్దుతానని చెప్పారు. ఎందరో రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయారని, తాను రాయలసీమకు పూర్వవైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

జగన్‌పై విమర్శలు

కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలను తీర్చిదిద్దుతానని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు పవన్. ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్‌.. ప్రజా సమస్యలను పట్టించుకోవాలన్నారు. శాసనసభ సమావేశాలకు వెళ్లకుండా రాష్ట్ర పర్యటన చేస్తే ఏం ప్రయోజనమని పవన్‌ ప్రశ్నించారు.

కాగా, రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు, వైద్య, ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ సమస్యలను పవన్‌కు వివరించారు. వైద్య విద్యార్థులు ఆర్‌ఎంపీ విధానాన్ని రద్దు చేయాలని పవన్‌ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.

చదవండి: రాహుల్! ‘హోదా’ ఎలా ఇస్తారు?: చంద్రబాబుపై ఉండవల్లి విమర్శలు

- Advertisement -