28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీలో 4లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

ఏపీలో 4లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

AP Latest News, AP Jobs Notification News, CMYS Jagan News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే పనిలో పడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు.

ఇప్పుడు ఆ పని మొదలు పెట్టారు. గ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ap.gov.in వైబ్ సైట్ లో జూలై నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం 4,33,126 వాలంటీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 15 ముందే ఫలితాలు విడుదల చేయనున్నారు.

అర్హత : పదవ తరగతి, ఇంటర్మీడియట్..
వయస్సు : 18 నుండి 39 సంవత్సరాల లోపు,
కావాల్సిన పత్రాలు
SSC సర్టిఫికెట్
కుల ధ్రువీకరణ పత్రం
నివాస ధ్రువీకరణ పత్రం
మెడికల్ సర్టిఫికెట్ (పీహెచ్‌సీలకు)
వేతనం నెలకు రూ.5వేలు

చదవండి:  ఏపీకి ఐదుగురు డిప్యూటీ సీఎం! జగన్ కీలక నిర్ణయం!
- Advertisement -