28.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అందుకే నేను జనసేనకు దూరంగా ఉంటున్నా..: నాగబాబు

అందుకే నేను జనసేనకు దూరంగా ఉంటున్నా..: నాగబాబు

- Advertisement -

హైదరాబాద్: ఏపీలో ఎన్నికల వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటినుండి అన్ని పార్టీలు కూడా తమ వ్యూహాలకి పదునుపెడుతున్నారు. ఎన్నికలకు ఒక నెల మాత్రమే సమయం ఉండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శరవేగంగా పావులు కదుపుతున్నారు.

32 అసెంబ్లీ, 9 పార్లమెంట్…

అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన జనసేనాని, ఇప్పటికే 32 అసెంబ్లీ స్థానాలకు, 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో నేడు జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, జనసేనకు దూరంగా ఉండటానికి గల కారణాలను వివరించారు.

తాను జనసేన పార్టీకి అభిమానిని మాత్రమేనని, నాయకుణ్ని కాదన్నారు. తన తమ్ముడు పవన్‌పై బంధుప్రీతి ముద్ర వేస్తారేమోనని జనసేనకు దూరంగా ఉంటూ వస్తున్నానన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని జనసేన కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -