
అమరావతి: రానున్న ఎన్నికల్లో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవడం తథ్యమని బల్లగుద్ది మరి చెబుతున్నారు సిని నటుడు నిర్మాత మంచు మోహన్ బాబు. ఏప్రిల్ 11న జరుగనున్న ఏపి ఎలక్షన్స్ లో ప్రజలు చంద్రబాబుకి బుద్ది చెబుతారని అలాంటి వెన్నుపోటు దారుడిని ప్రజలు అసలు నమ్మ కూడదని అన్నారు.
చంద్రబాబు ఊసరవెల్లి అని ఎన్.టి.ఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడని అన్నారు.హరికృష్ణ తనయుడు ఎన్.టి.ఆర్ తాను ముద్దుగా తారక్ అని పిలుస్తానని.. తారక్ ను కొద్దిరోజులు వాడుకుని వదిలేశాడు. ఆ తర్వాత సుహాసినిని కూడా ఈమధ్య ఎన్నికల్లో దింపి వాడుకున్నాడని అన్నారు.
మాట ఇచ్చి తప్పడం చంద్రబాబుకి అలవాటు అయితే రాజశేఖర్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాటే వేదంగా భావించే వ్యక్తి అని.. వైఎస్సార్ మాట చెప్పాడంటే అది వేదమే అన్నారు మోహన్ బాబు.వైఎస్సార్ అన్ని కులాల వారికి న్యాయం చేశారని తన దగ్గర పనిచేసిన డ్రైవర్ కు అవసరానికి డబ్బు ఇచ్చాడని అన్నారు మోహన్ బాబు.
చంద్రబాబులా వెన్నుపోటు పొడించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి కాదని.. యువతకు ఇంజినీరింగ్ చదువుకునే అవకాశం కల్పించిన గొప్ప మనిషి వైఎస్సార్.. ఆరోగ్య శ్రీ పథకం కూడా ఆయన ప్రవేశ పెట్టిందే అని అన్నారు.
ఇప్పుడు జగన్ కూడా ప్రజల కష్టాలు తెలుసుకున్నాడని.. ప్రజా సంకల్ప యాత్రతో 3600 కిలోమీటర్లు తిరిగాడు.
కచ్చితంగా ఈసారి జగన్ ను సిఎంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని.. అది జరిగి తీరుతుందని అన్నారు మోహన్ బాబు. చంద్రబాబు అందరిని వాడుకుని వదిలేసే బుద్ధి ఉన్న వ్యక్తి అని తాను ఏమాటైనా నిక్కచ్చిగా మాట్లాడుతానని ఈసారి జగన్ ను గెలిపిస్తేనే అందరికి మంచి జరుగుతుందని అన్నారు మోహన్ బాబు.








