
విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ లక్ష్యంగా ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… మహిళా ప్రభంజనంతో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని అన్నారు.
ఇక ఎన్నికలు ముగిసిన తరువాత 40 రోజుల పాటు అభ్యర్థులతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేని జగన్‌కు.. రాజ్యాధికారం పగటి కలేనని విమర్శించారు. అటు బీహార్ ముఠాతో ఏపీలో దిగిన ప్రశాంత్ కిశోర్, జగన్, విజయసాయిరెడ్డిలు, ఓడిపోయిన తరువాత మీడియా ముందుకు వచ్చి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
చదవండి:హస్తినలో బిజీ బిజీగా బాబు… వీవీప్యాట్‌లపై విపక్షాల ధర్నా
అరాచకశక్తులు అధికారం కావాలని పాకులాడుతున్నాయని, ఈ విషయాన్ని ఏపీ ప్రజలు ముందే గ్రహించి టీడీపీ వైపు మొగ్గు చూపరాని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ చూసుకుని, తెలంగాణలో జగన్ సంబరపడిపోతున్నారని ఎద్దేవా చేశారు.
అసలు ఏం చూసి ప్రజలు జగన్ కు ఓటు వేయాలని ప్రశ్నించారు. అమరావతిని భ్రమరావతి అన్న జగన్ కు ఎందుకు ఓటు వేస్తారని, రాష్ట్రం ఏమైపోతుందో అనే భయంతో ప్రజలు టీడీపీకే ఓటు వేశారని చెప్పారు.








