
విశాఖపట్నం: ఎన్నికలు అయిన దగ్గర నుంచి టీడీపీ, వైసీపీలు అధికారంలోకి వచ్చేది తామంటే తాము అని పోటాపోటిగా ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక వీరి మాటలకి తగ్గట్టుగా కొన్ని సర్వేలు టీడీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెబుతుండగా….మరికొన్ని సర్వేలు వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని చెబుతున్నాయి.
అలాగే జనసేన 4-5 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందని కొన్ని సర్వేలు చెబుతుంటే…మరి కొన్ని సర్వేలు 14-22 అసెంబ్లీ సీట్లు…2-3 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నాయి. కానీ జనసేన నేతలు మాత్రం వీటిని కొట్టిపారేస్తూ…ఏపీలో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయని చెబుతున్నారు. అధిక స్థాయిలో అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటామని…అలాగే 5 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీ నేతలు ధీమావ్యక్తం చేస్తున్నారు.
గెలిచే 5 ఎంపీ సీట్లు ఇవే…
ఇక ఇదే విషయాన్ని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ మాదాసు గంగాధరం స్ట్రాంగ్‌గా చెబుతున్నారు. బుధవారం గాజువాక నియోజకవర్గ జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గంగాధరంతో పాటు విశాఖపట్టణం, నర్సాపురం లోక్‌సభ అభ్యర్థులు జేడీ లక్ష్మీనారాయణ, నాగబాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మాదాసు…5 లోక్ సభ స్థానాల్లో జనసేన గెలుస్తుందని చెప్పారు. విశాఖపట్నం, నరసాపురం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని, మిగిలిన లోక్ సభ స్థానాల్లోనూ జనసేన గట్టిపోటీ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఏపీలో మార్పు మొదలైందని..మే 23న అనూహ్య ఫలితాలు వెలువడతాయని చెప్పారు.
చదవండి: ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్! డేట్ ఫిక్స్ చేసిన ఈసీ!








