32.2 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా తాజా సర్వే! ఆ ఇద్దరి కలయికే టీడీపీ కొంప ముంచనుందా?

కర్నూలు జిల్లా తాజా సర్వే! ఆ ఇద్దరి కలయికే టీడీపీ కొంప ముంచనుందా?

Kurnool Exclusive Latest Survey, Newsxpressonline
- Advertisement -

కర్నూలు: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి నడుస్తోంది. అన్ని ముఖ్య పార్టీల అధినేతలు ప్రచార బిజీలో ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మధ్య వచ్చే ఎన్నికల్లో గట్టిపోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది.

అలాగే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నటుడు పవన్ కళ్యాన్ ‘జనసేన’ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. కానీ ఆయన అప్పట్లో ఎన్నికల బరిలోకి దిగకుండా టీడీపీ, బీజేపీలను సపోర్ట్ చేశారు.

అయితే ప్రస్తుతం సీన్ మారింది.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సైతం రంగంలోకి దిగుతోంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇకపోతే మరో రెండు మూడు రోజుల్లోనే ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉండటంతో అధికార పీఠం చేజిక్కించుకోవడమే ధ్యేయంగా ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు.

కొంపముంచనున్న కేఈ.. కోట్ల కలయిక!?

అసలు విషయానికొస్తే.. ఎన్నికల ముందు సర్వేలు చేయడం షరా మాములే. ఇందులో భాగంగా తాజాగా కర్నూలు జిల్లాకి సంబందించిన సర్వే వివరాలు చూసి అధికార టీడీపీ వణికిపోతోంది. కర్నూలు జిల్లా ఒకప్పటి ఏపీ రాజధాని, రాయలసీమలోనే గొప్ప పేరుగల జిల్లా.

కర్నూలు జిల్లా నుండి ఎంతో మంది గొప్ప గొప్ప నేతలు ప్రాతినిధ్యం వహించారు. అలాగే ఇప్పటివరకు బద్ద శత్రువులుగా ఉన్న కోట్ల, కేఈ ఫ్యామిలీలు ప్రస్తుతం టీడీపీలో ఉండడంతో ఈ జిల్లాలో టీడీపీ పవనాలు ఎక్కువగా వీచే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇరువర్గాలకు చెందిన కొంతమంది కార్యకర్తలు మాత్రం వీరి కలయికను జీర్ణించుకోలేకపోతున్నారు.

అయితే, కర్నూలులో టీడీపీకి ఈసారి భారీ షాక్ తగలబోతోంది అని సమాచారం. కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకి గాను ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ 11 సీట్లు గెలుచుకోబోతున్నట్లు ఒక సర్వే చెబుతోంది. ఇక టీడీపీకి ఈ జిల్లాలో రెండు స్థానాలు మాత్రమే దక్కనున్నాయని అంటున్నారు.

కాబట్టి ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఏ మాత్రం పోటీ ఇచ్చే స్థితిలో టీడీపీ ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒకే స్థానంతో మూడో స్థానానికే పరిమితమౌవనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అనంతపురం జిల్లా తాజా సర్వే! ఏ పార్టీ బలమెంత?
రసపట్టులో ఏపీ రాజకీయం! అప్రకటిత టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా?
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019: కడప జిల్లా తాజా సర్వే! అధిపత్యమా.. అవమానమా?
- Advertisement -