26.7 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మోకాళ్లపై బెజవాడ దుర్గమ్మ వద్దకు కేసీఆర్ ఆంధ్రా అభిమాని: ఎందుకంటే..?

మోకాళ్లపై బెజవాడ దుర్గమ్మ వద్దకు కేసీఆర్ ఆంధ్రా అభిమాని: ఎందుకంటే..?

kcr-fan
- Advertisement -

kcr-fan

హైదరాబాద్/విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు తెలంగాణలోనేగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ చాలామంది అభిమానులు ఉన్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా వారు తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా మరో వీరాభిమాని తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు.

తెలంగాణలో రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టినందుకు ఏపీలోని ఆయన అభిమాని కొణిజేటి ఆదినారాయణ.. సోమవారం విజయవాడలోని దుర్గమ్మగుడి మెట్లను మోకాళ్లపై ఎక్కి మొక్కు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలవాలని ఎన్నికలకు ముందు దుర్గమ్మను కోరుకున్నానని, అందులో భాగంగానే మొక్కు చెల్లించుకున్నానని ఆదినారాయణ చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన యాగం కూడా విజయవంతం కావాలని దుర్గమ్మను కోరుకున్నానని తెలిపారు.

యాగం మొదలుపెట్టిన రోజే మొక్కు చెల్లించుకున్నా: ఆదినారాయణ

యాగం విజయవంతానికి, సీఎం కేసీఆర్‌కు ఎల్లప్పుడూ దుర్గమ్మ ఆశీస్సులుండాలనే ఉద్దేశంతో యాగం మొదలు పెట్టిన రోజే మొక్కు చెల్లించుకున్నట్టు తెలిపారు. సర్వజనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో మహారుద్రసహిత సహస్ర చండీయాగం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో సోమవారం వేదమంత్రోచ్చారణల మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే.

తెలంగాణతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన 300 మందిపైగా రుత్విక్కుల వేదపారాయణాలు, వేదమంత్రాలు ఎర్రవల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతిధ్వనించాయి. వ్యవసాయక్షేత్రంలో నిర్మించిన చండీ యాగవాటికలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సోమవారం ఉదయం 11 గంటలకు వేదోక్తంగా అంకురార్పణ చేశారు. విశాఖనుంచి ప్రత్యేకంగా వచ్చిన శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీస్వామి సమక్షంలో మేళతాళాలలో, మంత్రోచ్చారణతో యజ్ఞం ప్రారంభించారు. రెండోరోజైన మంగళవారం కూడా యాగం కొనసాగింది.

- Advertisement -