భీమవరం, కడప, కుప్పం ల పై కత్తి మహేష్ తాజా సర్వే

11:27 am, Thu, 28 March 19
Kathi Mahesh Latest Survey News, AP Latest Survey News, AP Political News, Newsxpressonline

హైదరాబాద్: ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.ప్రచారానికి అతి తక్కువ సమయం ఉండటంతో అన్ని ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇకపోతే సీని విశ్లేషకుడు కత్తి మహేష్ పేరును బహుశా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సీని విశ్లేషకుడు మాత్రమే కాదు రాజకీయ విశ్లేషకుడు కూడా.

కత్తి మహేష్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక రిపోర్టర్ అడిగిన కొన్ని నియోజకవర్గాలలోని రాజకీయ పరిస్థితి మరియు ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి అన్న దాని పై అయన కోణంలో కొంత విశ్లేషణ ఇచ్చారు.

అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్న భీమవరం నియోజకవర్గం గురించి అడుగగా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఓడిపోతారు అంటూ కుండబద్దలు కొట్టారు.
దీనికి కారణం ఏంటి అని కూడా ఆయన వివరించారు అక్కడ ఉన్న కాపు కులస్తుల ఓట్లు, రాజుల ఓట్లు చీలి రాజుల ఓట్లు పడక పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని చెప్పుకొచ్చాడు.

అలాగే కడప జిల్లా గురించి మాట్లాడుతూ , అక్కడ అన్నిచోట్ల జగన్ మోహన్ రెడ్డి వైపు ఉన్న కొన్ని ప్రాంతాలు మాత్రం టీడీపీ కైవసం చేసుకుంటుందట. అలాంటి నియోజకవర్గం లో జమ్మలమడుగు ఒకటి అని చెప్పారు. ఇక కుప్పం విషయానికి వస్తే అక్కడి ఈసారి చంద్రబాబు నాయుడు గెలవడం అసాధ్యం అన్నారు.

దీనికి వివరణ ఇస్తూ తన సొంత జిల్లా అయిన చిత్తూర్ ను అభివృధి పథం వైపు నడిపించడం లో విఫలం అయ్యారని, అక్కడి ప్రజలు కనీస అభివృధి కూడా లేక విసిగిపోయారనీ అని గుర్తుచేశారు. ఇలా తన శైలిలో రాజకీయ విశ్లేషణ ఇచ్చారు. చూడాలి మరి కత్తిమహేష్ చెప్పిన ఈ ఫలితాలు నిజమో కాదో తెలియాలి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయకతప్పదు…

చదవండి: మళ్లీ రెచ్చిపోయిన బాలయ్య.. వీడియో జర్నలిస్టుపై బండబూతులు