28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ జగన్ గురించి సంచలన నిజం బయటపెట్టిన జేడీ! అయోమయంలో టీడీపీనేతలు!

జగన్ గురించి సంచలన నిజం బయటపెట్టిన జేడీ! అయోమయంలో టీడీపీనేతలు!

JD Latest News, YS jagan Latest News, TDP Latest News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడు. జగన్ దోచుకున్న సొమ్ముతో అనేక ప్రాజెక్టులు కట్టొచ్చు, జగన్ లక్షకోట్లు ప్రభుత్వానికి అప్పగించి లొంగిపోవాలి. ఇలాంటి అనేక వందల వేల స్టేట్‌మెంట్లు కొన్నేళ్లుగా టీడీపీ నేతలు ఇస్తూ వచ్చారు.

అసలు ఇంతకీ జగన్ లక్ష కోట్లు తిన్నాడా, లేదా, ఈ విషయంపై ఇప్పుడు జగన్ కేసును డీల్ చేసిన జేడీ లక్ష్మీనారాయణే బయటపెట్టారు. సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ జగన్ కేసులపై మాట్లాడారు. జగన్ పై లక్ష కోట్ల అవినీతి అని ఆరోపణలు ప్రచారం చేయడం రాజకీయంలో భాగమేనని ఆయన స్పష్టం చేశారట.

చదవండి: జగన్ గెలిచినా ఏపీ అభివృద్ధి అసాధ్యమే! కారణం ఇదే!

ఒక టివి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. తాము ఎక్కడా అభియోగాలలో లక్ష కోట్లు అని చెప్పలేదని, ఎవరైనా రాజకీయం కోసం అలా ప్రచారం చేసుకుంటే తమకు సంబందం లేదని జేడీ క్లారిటీగా చెప్పేశారు. తమకు లభించిన ఎవిడెన్స్ ఆదారంగా కేసులు పెట్టామని ఆయన వివరించారు.

గ‌తంలో జ‌గ‌న్ మోహన్ రెడ్డి అవినీతి కేసులో జైల్లో ఉన్న‌ప్పుడు ప‌చ్చ‌మీడియాలు ఇదే విష‌యాన్ని హైలెట్ చేస్తూ నిజంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ల‌క్ష కోట్ల‌కు అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించారు. కానీ ఇటీవ‌లే జ‌గ‌న్ కేసుపై చార్జిషీట్ న‌మోదు చేసిన మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ స్ప‌ష్ట‌త ఇవ్వ‌డంతో టీడీపీ అండ్ కో మీడియాల‌కు బిగ్ షాక్ త‌గిలిన‌ట్లు అయింది.

అసలు ఇంతకీ జగన్ కేసుల్లో అక్రమాల మొత్తం ఎంత ఉంటుందని అడగితే.. మొత్తం మీద 1500 కోట్ల ఆరోపణ ఉండవచ్చని జేడీ అన్నారు. మొత్తానికి ఇన్నాళ్లకు జేడీ లక్ష్మీనారాయణ నోరు విప్పి జగన్ నెత్తిన పాలు పోశాడన్నమాట. ఇక ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఏం చెబుతాయో.. మరి.

చదవండి: ఏపీలో రాష్ట్రపతి పాలన! కేంద్రంలో కదలికలు! షాక్ లో టీడీపీనేతలు!
- Advertisement -