
- Advertisement -

కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ , ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని జయరామ్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణ లో భాగంగా పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శనివారం నందిగామ పోలీసులు జూబ్లీహిల్స్‌లోని జయరామ్ ఇంటికి చేరుకొని, సీసీ ఫుటేజీని దర్యాప్తు బృందం పరిశీలించింది.
జగ్గయ్యపేటలో శిఖాచౌదరిని విచారిస్తున్న పోలీసులు..
ఈ కేసులో విచారణ లో భాగంగా జయరామ్ మేనకోడలు శిఖాచౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే శిఖా చౌదరి సోదరిని కూడా విచారిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈమెని జగయ్య పేటలోని ఒక గెస్ట్ హౌస్ లో విచారణ చేస్తునట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన గొడవలే ఈ హత్యకు దారి తీశాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశలోనే దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే ఈ రోజు సాయంత్రం లోపు శిఖా చౌదరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది .
చదవండి..చిగురుపాటి హత్య కేసు: రంగు మారిన మృతదేహం.. విషప్రయోగం జరిగి ఉంటుందా? పోలీసుల అనుమానం…
- Advertisement -








