

జనసేన నేత కల్యాణ్ దిలీప్ సుంకర గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ కార్యకర్తగా, పవన్ అభిమాన సంఘం నాయకుడిగా ఈయన పరిచయస్తుడే. ప్రస్తుతం జనసేనలో యాక్టివ్ మెంబర్‌గా ఉన్న వారిలో దీలీప్ సుంకర ఒకరు.
హీరో శివాజీని ఘోరంగా అవమానించాడుగా….
ఆ పార్టీ తరపున డిబేట్లలో పాల్గొనడం, సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై విమర్శలు కురిపించడం వంటివి చేస్తుంటారు. తాజాగా ఈయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ప్రముఖ నటుడు, ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యుడు శివాజీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
హీరో శివాజీ గురించి ఏం చెబుతారు అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ‘‘ఛీ.. ఛీ.. ఎవరి గురించి మాట్లాడమంటున్నారు. విషయం లేని శివాజీ గురించి నేను మాట్లాడడం ఏంటండి..? ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలనుంటే తెలుపుకోమనండి..’’ అంటూ దిలీప్ వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ‘‘ప్రెస్‌మీట్లు పెట్టి తను చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్లిపోతాడు. దమ్మున్న నాయకుడైతే డిబేట్లలో పాల్గొనాలి. డిబేట్ల వల్లే ఓ నాయకుడి స్టామినా ఏంటో తెలుస్తోంది. కానీ, శివాజీ ఎన్ని డిబేట్లు చేశాడు. ఆయన గురించి ఏముందని మాట్లాడాలి..’’ అంటూ విమర్శించారు. మరి దిలీప్ సుంకర వ్యాఖ్యలపై శివాజీ ఏమంటారో?








