23.4 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ సైకిల్‌పై గాజు గ్లాసు ప్రభావం గట్టిగానే పడిందే….

సైకిల్‌పై గాజు గ్లాసు ప్రభావం గట్టిగానే పడిందే….

Janasena Latest News, TDP Latest News, AP Political Latest News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 151 స్థానాలని కైవసం చేసుకోగా…టీడీపీ 23, జనసేన ఒక స్థానంలో గెలిచింది.

ఇక 25 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ 22, టీడీపీ 3 స్థానాల్లో గెలిచింది. అయితే ఎన్నికలు అయ్యాక వైసీపీ గెలుస్తుందని ప్రచారం ఎక్కువగా జరిగింది. వైసీపీ కనీసం 110 నుంచి 120 సీట్లు గెలుస్తుందని ఎక్కువమంది అనుకున్నారు.

కానీ ఆ అంచనాలని తలకిందులు చేస్తూ వైసీపీ 151 చోట్ల విజయఢంకా మోగించింది. ఇక టీడీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం వల్లే టీడీపీ ఇలా ఘోరంగా ఓడిపోయిందని లేదంటే కనీసం 50 స్థానాలు అయిన గెలుచుకునేదని ప్రచారం జరుగుతుంది.

టీడీపీకి జనసేన దెబ్బ…

సుమారు 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ సీట్లలో టీడీపీ విజయంపై జనసేన పెను ప్రభావం చూపింది. ఈ మొత్తం చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వారికి వచ్చిన మెజారిటీ కన్నా కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయి.

పార్లమెంట్ సీట్లలో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. అటు దాదాపు 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీని జనసేన పరోక్షంగా దెబ్బ కొట్టింది.

ఆ 31 నియోజకవర్గాలు ఇవే…

శ్రీకాకుళం, విజయనగరం, గాజువాక, అనకాపల్లి, యలమంచిలి, ప్రత్తిపాడు (తూ.గో), పిఠాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, గన్నవరం, కొత్తపేట, నిడదవోలు, ఆచంట, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, తెనాలి, ప్రత్తిపాడు (గుంటూరు), గుంటూరు తూర్పు, నెల్లూరు సిటీ.

చదవండి: సార్..కారుకి బ్రేకులు పడ్డాయ్….
- Advertisement -