29.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఇక నాగబాబుకు పార్టీలో కీలక బాధ్యతలు.. జనసేనాని యోచన!

ఇక నాగబాబుకు పార్టీలో కీలక బాధ్యతలు.. జనసేనాని యోచన!

nagababu-pawan-kalyan
- Advertisement -

అమరావతి: జనసేనలోని చిన్న చిన్న లోపాలను గుర్తించి వాటిని సవరించే పనిలో పడ్డారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా పార్టీలో నాయకులకు, శ్రేణులకు మధ్య సమన్వయం లేదని గుర్తించిన పవన్ దీని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకున్నారు.

చదవండి: ఎట్టకేలకు నటుడు శివాజీని పట్టుకున్న పోలీసులు! శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్.. పాస్‌పోర్ట్ సీజ్!

అంతేకాదు, ఈ సమస్యను పరిష్కరించే ప్రక్రియలో భాగంగా తన సోదరుడు నాగబాబు విషయంలో కూడా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు.

సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి…

పార్టీలోని నాయకులు, పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయం కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, దాని బాధ్యతలను నాగబాబుకు అప్పగించాలని జనసేనాని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

క్షేత్ర స్థాయి నాయకులను తాను స్వయంగా కలవడానికి వీలుకుదరక పోవడంతో.. ఇక ఆ బాధ్యతను నాగబాబుకు అప్పగిస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో ఆయన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా నాగబాబు ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

చదవండి: జగన్ సంచలన నిర్ణయం.. అర్బన్ హౌసింగ్‌ స్కీమ్‌లోనూ ‘రివర్స్ టెండరింగ్’!?

పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉంటూ.. కింది స్థాయి నేతలతో నాగబాబు తరచూ సమావేశాలు నిర్వహిస్తుండేవారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేనలో కూడా ఈ సమన్వయ బాధ్యతలను నాగబాబుకు అప్పగించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఆయన సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

- Advertisement -