22.7 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వివేకాను జగన్ కొట్టారు: చంద్రబాబు సంచలన ఆరోపణలు

వివేకాను జగన్ కొట్టారు: చంద్రబాబు సంచలన ఆరోపణలు

Jagan had differences with his uncle Viveka: Chandrababu Naidu, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల హత్యకు గురైన వైఎస్ వివేకానందకు జగన్మోహన్ రెడ్డి నుంచి వేధింపులు ఉన్నాయని అన్నారు. గతంలో వైఎస్ వివేకాను జగన్ రెండుసార్లు కొట్టాడని, బలవంతంగా రాజీనామా చేయించారని అన్నారు. ఈ మేరకు మీడియాలో కథనాలు కూడా వచ్చాయన్నారు.

గుండెపోటుగా పక్కదారి పట్టించేయత్నం..

ఇప్పుడు చిన్నాన్న హత్యనే గుండెపోటుగా పక్కదారి పట్టించాడని చంద్రబాబు ఆరోపించారు. సోమవారం ఉదయం తన నివాసం నుంచి పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో సిట్ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. దోషులను వదిలేదని చెప్పారు.

వచ్చే ఎన్నికలు అభివృద్ధి, అరాచకానికి జరిగే ఎన్నిక అని.. వైసీపీకి ఓటు వేస్తే అరాచకానికి ఓటు వేసినట్లేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీకి ఓటు వేస్తే భూములు, ఆస్తులకు భద్రత ఉండదన్నారు. 10లక్షల సైన్యం ఉన్న అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయిస్తే.. 65లక్షల పసుపు సైన్యంతో ఎన్నికలు ఏకపక్షం కావాలని చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు.

పోలవరంపై తెలంగాణ ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టులో కేసు వేసిందని, అలాంటి వాళ్లతో జగన్ అంటకాగుతూ రాష్ట్రంలో ఓటు అఃడుగుతున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదని మండిపడ్డారు. సోమవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతోందని, లబ్ధిదారులంతా టీడీపీ అభ్యర్థులకు అండగా ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు.

 

- Advertisement -