18.7 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి.. అయినా అసంతృప్తిగానే సీనియర్ నేత!

టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి.. అయినా అసంతృప్తిగానే సీనియర్ నేత!

- Advertisement -

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరును జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే తనను రాజ్యసభకు పంపాలని సుబ్బారెడ్డి కోరినట్లు సమాచారం. సుబ్బారెడ్డి ప్రతిపాదనను జగన్ తోసిపుచ్చి తర్వాత చూద్దామని చెప్పినట్లు సమాచారం.

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు మారుతారన్న వార్తలు వినిపించాయి. టీటీడీ చైర్మన్‌గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ స్థానంలో సినీ నటుడు మోహన్ బాబును ఎంపిక చేస్తారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

తనను పక్కనపెట్టడంపై అలక

జగన్ బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డి గత ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే, టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇవ్వడం కోసం సుబ్బారెడ్డిని జగన్ పక్కనబెట్టారు. దీంతో ఆయన కొంచెం అసంతృప్తితో కనిపించారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు టీటీడీ చైర్మన్ పదవిని జగన్ ఆఫర్ చేసినప్పటికీ ఆయన వద్దని చెప్పినట్టు తెలుస్తోంది. తనను రాజ్యసభకు పంపాలని కోరినట్టు సమాచారం. అయితే, జగన్ మాత్రం ఆ విషయం తర్వాత చూద్దామని చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సుబ్బారెడ్డి నియామకానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

- Advertisement -