21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ తండ్రి జ్ఞాప‌కంతో జగన్ ప్ర‌మాణ స్వీకారం!

తండ్రి జ్ఞాప‌కంతో జగన్ ప్ర‌మాణ స్వీకారం!

y es jagan mohan reddy
- Advertisement -

అమరావతి: ఏపీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిలో ఓ స‌రికొత్త మార్పు క‌నిపించింది. ఆ మార్పు ఇంత‌కుముందు ఎప్పుడూ లేదు. అదే వాచీ. త‌న తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి చెందిన వాచిగా చెబుతున్నారు స‌న్నిహితులు.

త‌న తండ్రి జ్ఞాప‌కంగా వైఎస్ జ‌గన్ ప్ర‌మాణ స్వీకారం రోజు ధ‌రించార‌ని అంటున్నారు. ముఖ్య‌మంత్రిగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎప్పుడూ వాచీతో క‌నిపించేవారు. దాన్నే ఇప్పుడు ఆయ‌న ధ‌రించారు. వైఎస్ జ‌గ‌న్ త‌న చేతికి ఎప్పుడూ వాచి ధ‌రించిన సంద‌ర్భాలు లేనే లేవు.

ప్ర‌తిప‌క్ష నేత‌గా స‌భ‌లో క‌నిపించిన‌ప్పుడు గానీ, ప్ర‌త్యేక హోదా డిమాండ్ సాధ‌న కోసం దీక్ష‌లు చేప‌ట్టిన‌ప్పుడు గానీ, సుదీర్ఘ పాద‌యాత్ర‌లో గానీ ఈ వాచీ వైఎస్ జ‌గ‌న్ చేతికి ఉండేది కాదు.అస‌లు ఆయ‌న‌కు చేతికి వాచీ ధ‌రించే అల‌వాటు లేద‌ని స‌న్నిహిత నాయ‌కులు చెబుతుంటారు. అలాంటిది- ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న సంద‌ర్భంగా దాన్ని ధ‌రించారు. ఆ వాచీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిద‌ని తెలుస్తోంది.

- Advertisement -