‘మల్లేశం’ చిత్రబృందానికి కేటీఆర్ బెస్ట్ విషెస్….

8:05 pm, Thu, 30 May 19

హైదరాబాద్: నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో రాజ్ ఆర్ దర్శకత్వంలో తెలంగాణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మల్లేశం’.

ఎన్నో భావద్వేగాలతో కూడుకున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై..అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో మల్లేశం సినిమా ట్రైలర్‌ను వీక్షించినట్లు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కేటీఆర్ ట్వీట్..

‘ఎంతోమందికి స్ఫూర్తిని కలిగించే తెలంగాణ చేనేత కార్మికుడు, ఆసుయంత్రం సృష్టికర్త జీవితం ఆధారంగా తీసిన ‘మల్లేశం’ ట్రైలర్‌ను చూశా. ఆసు యంత్రాన్ని కనిపెట్టినందుకు చింతకింది మల్లేశంకు 2017లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ‘మల్లేశం’ చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇక నిన్న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్‌కి చేరువైంది. మల్లేశం లవ్ స్టోరీ, ఫ్రెండ్స్‌తో సరాదాగా సాగే ఘటనలు.. తల్లి కష్టం చూడలేక ఆసు యంత్రం కనిపెట్టే క్రమంలో పడే శ్రమ, ఎదుర్కొన్న ఛీత్కారాలు.. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా… రూపొందిన మల్లేశం చిత్రం జూన్ 21న విడుదల కానుంది.

చదవండి: యాత్ర-2లో రాజారెడ్డి, జగన్‌ పాత్రలే మెయిన్…