32.2 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వావ్.. రూ.9కే చీర, రూ.1కే బ్యాగ్.. కిలోమీటర్ల మేర క్యూ కట్టిన మహిళలు, ఎక్కడంటే…

వావ్.. రూ.9కే చీర, రూ.1కే బ్యాగ్.. కిలోమీటర్ల మేర క్యూ కట్టిన మహిళలు, ఎక్కడంటే…

one-rupee-saree-in-cuddapah-1
- Advertisement -

one-rupee-saree-in-cuddapah

కడప: ఓ వస్త్ర దుకాణం యజమాని రూ.9కే చీర అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ ప్రకటన వినడమే ఆలస్యం మహిళలంతా ఆ వస్త్ర దుకాణం ముందు క్యూ కట్టేశారు. ఈ ఘటన ఆదివారం కడప పట్టణంలో చోటుచేసుకుంది.

రెండేళ్ల క్రితం కూడా ఇలాగే బీదర్ పట్టణానికి చెందిన ఓ వస్త్ర వ్యాపారి రూపాయికే చీర అంటూ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తగా.. తాజాగా కడప పట్టణంలో ఓ వస్త్ర దుకాణం యజమాని రూ.9కే చీర, రూ.1కే బ్యాగు అంటూ బంపరాఫర్ ప్రకటించడం సంచలనం సృష్టించింది.

దీంతో ఆదివారం ఉదయం 6 గంటలకే మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సదరు వస్త్ర దుకాణం ముందు క్యూ కట్టేశారు. కాసేపటికే ఈ క్యూ కిలోమీటర్ల మేర పెరిగిపోయింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ బంపరాఫర్ ఇస్తోన్నట్లు సదరు దుకాణం యజమాని ప్రకటించడంతో చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు, యువతులు చీరల కోసం ఎగబడిపోయారు.

దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అక్కడ ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకుండా చర్యలు చేపట్టాల్సి వచ్చింది.

అప్పట్లో.. బీదర్‌లో ఇలాగే…

గత ఏడాది కర్ణాటక ఎన్నికల ముందు కూడా బీదర్‌‌లోని సృష్టి-దృష్టి షోరూం యజమాని చంద్రశేఖర్‌ రూ.1కే చీర అంటూ ప్రకటన చేయడంతో ఆడపడుచులు ఎగబడ్డారు.

జేడీఎస్ పార్టీ వీరాభిమాని అయిన చంద్రశేఖర్.. తనకు కలలో తిరుమల వేంకటేశ్వర స్వామి కనిపించి చెప్పాడని, తన అభిమాన నేత కుమారస్వామి మళ్లీ సీఎం కావాలంటే 5 లక్షల చీరలు పంచాలని స్వామి వారు ఆదేశించారని, అందుకే తాను రూ.1కే చీర స్కీమును ప్రకటించానని పేర్కొన్నారు.

ఇప్పుడు కడప పట్టణంలో కూడా సదరు వస్త్ర వ్యాపారి రూ.9కే చీరల అమ్మకం మొదలుపెట్టారు. మొత్తానికి మన ఆడపడుచులు లక్కీ! ఎవరైనా రూ.1కే జీన్స్ ప్యాంట్ అని ప్రకటిస్తే ఎంత బాగుండు అని మగమహారాజులు కోరుకోవడంలో తప్పు లేదు కదా?

- Advertisement -