హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ, ఎందుకంటే…

chandra-babu-naidu
- Advertisement -

chandra-babu-high-court

అమరావతి: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ నియామకం విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నియామకంపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా కారెం శివాజీని ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకం చెల్లదంటూ న్యాయవాది హరిప్రసాద్‌ హైకోర్టును ఆశ్రయించారు.

శివాజీ నియామకం చెల్లదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఆయన తన పిటిషన్‌లో ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లఘించిన ఏపీ ప్రభుత్వం శివాజీని తిరిగి కమిషన్‌ చైర్మన్‌గా నియమించడంపై న్యాయవాది హరిప్రసాద్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, కమిషన్‌ చైర్మన్‌ నియామక పక్రియకు సంబంధించిన రికార్డులను కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అక్టోబర్‌ 31న కారెం శివాజీ నేరుగా కోర్టుకు హాజరుకావాలని కూడా హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

- Advertisement -