బొబ్బిలి: గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరి పేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య సహా పలువురు జిల్లా నేతలు శనివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 289వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ఈ రోజు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలోని ఇందిరమ్మ కాలనీ నుంచి ప్రారంభమైంది.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ టీడీపీ నేతలను వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే వైసీపీలో చేరినట్లు శివన్నారాయణ, శివయ్య తెలిపారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తామని పేర్కొన్నారు.
ఇక ఈ రోజు జగన్ 289వ రోజు పాదయాత్ర.. బొబ్బిలి నియోజకవర్గంలోని ఇందిరమ్మ కాలనీ, పోలవాని వలస, మెట్ట వలస, భోజరాజపురం క్రాస్, సీతారాంపురం మీదుగా పారాది వరకూ సాగనుంది. పాదయాత్ర సందర్భంగా గుంటూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం ఇక్కడి వైసీపీ శ్రేణులకు మరింత బలాన్నిచ్చింది.