26.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ గజ‘గజ’: ఉధృతంగా మారిన తుపాను.. 80 నుంచి 100 కి.మీ వేగంతో ఈదురుగాలులు, 6 అడుగుల...

గజ‘గజ’: ఉధృతంగా మారిన తుపాను.. 80 నుంచి 100 కి.మీ వేగంతో ఈదురుగాలులు, 6 అడుగుల ఎత్తున ఎగిసిపడే అలలు…

intensify gaja cyclone red alert andhra pradesh and tamil nadu
- Advertisement -

 intensify gaja cyclone red alert andhra pradesh and tamil nadu

విశాఖపట్నం:  బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గజ’ తుపాను గజగజలాడిస్తోంది. ఈ తుపాను ఇప్పడు ఉధృతంగా మారింది. ప్రస్తుతం నాగపట్నానికి తూర్పు ఈశాన్యంగా 300 కిలోమీటర్ల దూరంలో.. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో ఈ ‘గజ’ తుపాను కేంద్రీకృతమై ఉంది.

గురువారం రాత్రికి ‘గజ’ తుపాను  పంబన్‌-కడలూరు మధ్య తీరం దాటనుందని, దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలియజేసింది. అలాగే ఉత్తర తమిళనాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ఆ శాఖ  హెచ్చరించింది.

అలలు 6 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం…

తీవ్రంగా మారిన ‘గజ’ తుపాను వల్ల తీరప్రాంతంల్లో 80 నుంచి 100 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అలాగే  సముద్రంలో అలలు 6 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -