21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతంలో అల్లకల్లోలం.. మంగినపూడి బీచ్‌లో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలు..

బంగాళాఖాతంలో అల్లకల్లోలం.. మంగినపూడి బీచ్‌లో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలు..

fani cyclone
- Advertisement -

మచిలీపట్నం: వర్షాకాలం రాకముందే వర్ణుడి ఆట మొదలైనట్టుంది. రాష్ట్రంలో ‘ఫణి తుఫాను ప్రవేశిస్తోంది. సన్నటి ఈదురు గాలులు, చిన్న చిన్న చినుకులతో సముద్ర తీర వాసులని అప్రమత్తం చేస్తోంది.

నేడు బంగాళాఖాతంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఉత్తరాంధ్రతో పాటూ అన్ని సముద్ర తీరాల్లోనూ ‘ఫణి’ తుఫాను తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. క్షణక్షణానికి అలల తీవ్రత పెరుగుతుంది.

అన్ని తీర ప్రాంతాలలోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పర్యటకులను నిషేధిస్తున్నారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సుమారు 15 అడుగుల మేర అలలు ఎగసి పడుతున్నాయి.

చదవండి: అతి తీవ్ర తుపానుగా ‘ఫణి’.. ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు!

అలల ఎగసిపాటుని చూస్తుంటే సముద్రం ఆకాశాన్ని అందుకునే ప్రయత్నం చేస్తోందా అన్నట్టు అనిపిస్తుంది. ప్రకృతి పంపుతున్న ప్రకంపనలు చూస్తున్న తీరంలోని జనం భయభ్రాంతులకు లోనవుతున్నారు. బీచ్ చూడడానికి వచ్చిన పర్యాటకులను వెనక్కి పంపించేశారు.

ఇదిలా ఉండగా తుఫాను ప్రభావానికి అప్రమత్తమైన రైల్వే శాఖ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్లలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది. పలు చోట్ల రైళ్లని రద్దు చేసింది. ఇప్పటికే తూర్పు కోస్తా రైల్వే 74 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ వెళ్లే రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

ఈ రాత్రి ఫణి ప్రభావం ఎక్కువగానే కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు, అదికారులూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది.

 

- Advertisement -