28.2 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ ఇంటికి మాత్రమే.. గ్లాస్ బార్‌కి పరిమితం.. సైకిల్ అసెంబ్లీకి ఖాయం…!

ఫ్యాన్ ఇంటికి మాత్రమే.. గ్లాస్ బార్‌కి పరిమితం.. సైకిల్ అసెంబ్లీకి ఖాయం…!

Balayya Latest News, TDP Latest News, AP Latest Political News, Newsxpressonline
- Advertisement -

హిందూపురం: ఫ్యాన్‌ ఇంటికి, గ్లాస్‌ బారుకే పరిమితం కానీ సైకిల్‌ మాత్రం అసెంబ్లీకి వెళ్తుందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన లేపాక్షి మండలం లోని శిరివరం, గోపిందేరపల్లి, మద్దిపి, కంచిసముద్రం, మైదుగోళం, బొక్సంపల్లి, మామిడిమాకులపల్లి, గొంగటిపల్లి, లేపాక్షి, కొండూరు, కుర్లపల్లిలో పర్యటిం చారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు బాలయ్యకు బ్రహ్మరథం పట్టారు. గ్రామాల పొలిమేరలోకి చేరుకున్న వెంటనే హారతులుపట్టి ఆహ్వానించారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ మోదీ పచ్చి మోసగాడని ఆయన చేసేవ న్నీ మోసాలేనన్నారు.

వైసీపీకి ఓటువేస్తే అది మోదీకి వేసినట్లేనని ప్రజలు అప్రమత్తంగా ఉండి మరోసారి తెలుగుదేశంకు ఓటువేస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే మళ్ళీ నన్ను ఎమ్మెల్యే గా గెలిపిస్తే హిందుపూర్ ని మరింత అభివుద్ది చేస్తాను అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -