28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో భేటీకానున్న డీఎల్! రెండు, మూడు రోజుల్లో టీడీపీలోకి!

సీఎం చంద్రబాబుతో భేటీకానున్న డీఎల్! రెండు, మూడు రోజుల్లో టీడీపీలోకి!

dlravinderreddy meets cm babu
- Advertisement -

dlravinderreddy meets cm

అమరావతి: ఈ రోజు బుధవారం సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబుతో కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి భేటీ కానున్నారు. మైదుకూరు టికెట్‌ ఇవ్వాలని మాజీ మంత్రి డీఎల్ కోరుతున్నారు.

టీడీపీ అధిష్టానం కూడా మైదుకూరు టికెట్‌ డీఎల్‌కు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే.. మైదుకూరు టికెట్ తనకే ఇవ్వాలని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పట్టుబడుతున్నారు.

డీఎల్ కి లైన్ క్లియర్….

డీఎల్, చంద్రబాబు భేటీ అనంతరం మైదుకూరు టికెట్ విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. టికెట్ ఖాయమైతే డీఎల్ టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టుగా భావించవచ్చు.

ఇకపోతే ఈ మాజీ మంత్రి టీడీపీలో చేరితే అది వైసీపీకి ప్రతికూలం కావచ్చు, కడప రాజకీయాలలో డీఎల్ తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. చూడాలి మరి డీఎల్ టీడీపీలో చేరితే వైసీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకువస్తుందో..

- Advertisement -