కర్నూలు బాలసాయి బాబా కన్నుమూత… శోకసంద్రంలో భక్తులు

- Advertisement -

kurnool-bala-sai-baba

కర్నూలు:  శివరాత్రి నాడు తన నోటి నుంచి శివలింగాలు తీస్తూ పేరు తెచ్చుకున్న బాలసాయి బాబా ఇక లేరు.  మంగళవారం ఉదయం ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలసాయి బాబా మరణాన్ని ఆసుపత్రి వర్గాలు కూడా ధ్రువీకరించాయి.

బాలసాయి బాబా తనదైన ప్రవచనాలతో భక్తులను ఆయన విశేషంగా ఆకట్టుకునేవారు. ఆయన మృతి వార్త విని ఆయన అనుచరులు, భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.  ఆయన పేరిట కర్నూలు ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి.  మరోవైపు బాలసాయి బాబాపై పలు అరోపణలు కూడా ఉన్నాయి.

గుప్త నిధుల తవ్వకాలు, భూమిని ఆక్రమించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.  ఆయన మ‌ృతికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -