23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ పవన్‌కల్యాణ్ పోటీ స్థానంపై క్లారిటీ ?

పవన్‌కల్యాణ్ పోటీ స్థానంపై క్లారిటీ ?

Pawan_Kalyan_Jana_Sena_party
- Advertisement -

అమరావతి: ఏపీలో ఎన్నికల సమర శంఖారావం మొదలైంది. ఈసీ చడీచప్పుడు లేకుండా కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికలు జరపబోతున్నట్టు చెప్పడంతో అన్ని ప్రధాన పార్టీలు తమ కార్యాచరణపై దృష్టిసారించాయి. ఏప్రిల్ నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేసే స్థానం ఖరారైనట్లు తెలుస్తోంది.

ఒకే జిల్లాలో లోకేష్ ..పవన్..

విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పవన్ పోటీచేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా విశాఖ ఉత్తరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్నారని సమాచారం.

దీనితో ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుండడంతో జిల్లా వాసుల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది.

- Advertisement -